Health Benefits of Milk: పాలను ఉదయం తాగుతున్నారా? అసలు పాలను ఎప్పుడు తీసుకుంటే మంచిది?

|

Aug 17, 2023 | 5:39 PM

పాలు.. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఒకటి. పాలల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందులోనూ ఫ్రెష్ మిల్క్ తీసుకుంటే.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. పిల్లల నుంచి పెద్దవారు దాకా కనీసం రోజూ ఒక గ్లాస్ పాలనైనా తాగాలని వైద్యులు కూడా సూచిస్తూంటారు. అయితే సమయాన్ని బట్టి, వీలును బట్టి పాలను తాగుతారు. అయితే పాలను ఎప్పుడు తాగితే మంచిది? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. పాలను రోజూ తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?..

Health Benefits of Milk: పాలను ఉదయం తాగుతున్నారా? అసలు పాలను ఎప్పుడు తీసుకుంటే మంచిది?
Follow us on

పాలు.. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఒకటి. పాలల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందులోనూ ఫ్రెష్ మిల్క్ తీసుకుంటే.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. పిల్లల నుంచి పెద్దవారు దాకా కనీసం రోజూ ఒక గ్లాస్ పాలనైనా తాగాలని వైద్యులు కూడా సూచిస్తూంటారు. అయితే సమయాన్ని బట్టి, వీలును బట్టి పాలను తాగుతారు. అయితే పాలను ఎప్పుడు తాగితే మంచిది? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. పాలను రోజూ తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? మిల్క్ ను ఏ సమయంలో తీసుకుంటే మనకు ఉపయోగమో ఇప్పుడు తెలుసుకుందాం.

కొందరు పాలను ఉదయం లేదా రాత్రి ఏదో ఒక పూట తాగుతూంటారు. మరికొందరు ఉదయం, రాత్రి రెండు పూటలా తీసుకుంటారు. అయితే రాత్రి కంటే ఉదయం పాలను తాగితే చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట తీసుకునే ఆహారమే.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి పాలను ఉదయం తీసుకుంటేనే చాలా బెటర్. అలాగే మార్నింగ్ అల్పాహారంలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు, మంచి కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇది రోజంతా పని చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. శరీరం కూడా అలసటగా ఉండకుండా చేస్తాయి.

ఉదయం పూట పాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత క్యాల్షియం లభిస్తుంది. వీటితో ఎముకలు, దంతాలు గట్టిగా మారతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉండేలా చేస్తాయి పాలు. ఎదిగే పిల్లలకు పాలను ఉదయం, రాత్రి ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. పాలలో ఉండే ఫాస్పరస్, జింక్, ప్రొటీన్స్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ వంటి పోషకాలు అన్నీ మన బాడీకి అందుతాయి. దీంతో శరీరం బలంగా, ధృడంగా ఉంటుంది. పాలతో కేవంల శరీరానికే కాదు.. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పాలలో కొవ్వులు, ప్రొటీన్లు ఉంటాయి కాబట్టి.. ఇవి ఉదయం పూట తీసుకుంటేనే బెటర్. రాత్రి పూట తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి