గర్భిణీలు దూర ప్రయాణం చేయవచ్చా.. ఒక వేళ చేయాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

| Edited By: Ravi Kiran

May 29, 2023 | 8:00 AM

మహిళలు గర్భంతో ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మొదటి మూడు నెలలు పిండం అభివృద్ధి చెందుతున్న దశలో ఎక్కువగా ప్రయాణాలు చేయకూడదు.

గర్భిణీలు దూర ప్రయాణం చేయవచ్చా.. ఒక వేళ చేయాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Pregnant
Follow us on

మహిళలు గర్భంతో ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మొదటి మూడు నెలలు పిండం అభివృద్ధి చెందుతున్న దశలో ఎక్కువగా ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు ప్రయాణం చేయకుండా నివారించుకుంటే మంచిది. . దూర ప్రయాణాల్లో చాలా రిస్కులు ఉంటాయి అందుకే మొదటి మూడు నెలల పాటు ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. . మరి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సివస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

-నిజానికి మొదటి మూడు నెలల్లో గర్భం పెద్దగా కానీ బయటికి కనిపించదు. మహిళలు తిరగటానికి కూడా కాస్త సులభంగానే ఉంటుంది. కానీ దూర ప్రయాణాలు మాత్రం రిస్క్ అనే చెప్పాలి ఎందుకంటే పిండం ఎదుగుతున్న సమయంలో ఇంకా సరిగ్గా స్థిరపడదు అందువల్ల మొదటి మూడు నెలలు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే మంచిది. . ముఖ్యంగా దూర ప్రయాణాలు మానుకోవాలి ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే రైలు మార్గంలో వెళ్తే మంచిది. రోడ్డు మార్గంలో కురుపులు ఎక్కువగా ఉండే ప్రమాదం అండి అప్పుడు గర్భస్థ పిండానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

– 3 నుంచి 6 నెలల గర్భధారణ సమయంలో కారులో నాన్‌స్టాప్‌గా ఎక్కువ దూరం ప్రయాణించడం మంచిది కాదు. ఒకవేళ దూర ప్రయాణం చేయాల్సి వస్తే హైవే మార్గంలో వెళ్తే మంచిది రోడ్లు కుదుపులో ఉన్న మార్గంలో ప్రయాణం దాదాపు మానుకుంటే మంచిది. కారులో ప్రయాణానికి మధ్యలో విరామం తీసుకోవడం ఉత్తమం. కారులో ఉన్నప్పుడు మీ పాదాలను తిప్పడం, మీ కాలి వేళ్లను కదిలించడం వంటివి చేస్తుండాలి. విమానంలో ప్రయాణించడం గర్భిణీ స్త్రీకి లేదా ఆమె బిడ్డకు హానికరం కానప్పటికీ, వైద్యులు, విమానయాన సంస్థ నిర్ధారించిన తర్వాత చేయడం ఉత్తమం. 28-34 వారాల గర్భధారణ మధ్య ‘ఫిట్ టు ఫ్లై’ సర్టిఫికేట్ అవసరం. 4 గంటలకు మించిన సుదూర ప్రయాణం కదలలేని పరిస్థితి కారణంగా (డీప్ వెయిన్ థ్రాంబోసిస్) దిగువ అవయవాల సిరల్లో గడ్డకట్టే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

-గర్భధారణ సమయంలో ప్రయాణంలో ఆహారం మరియు నీటి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త వహించండి. తాగు నీరు వినియోగానికి సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయండి, లేకపోతే మినరల్ బాటిల్ వాటర్‌కు ప్రాధాన్యత ఇవ్వండి.

-గర్భధారణ సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ ప్రసూతి వైద్యుల రిపోర్టులను స్కానింగ్ కాపీలని తీసుకెళ్లండి, ఎందుకంటే ఇది మీ పరిస్థితిని సూచించడానికి స్థానిక చికిత్స వైద్యుడికి సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను కూడా నోట్ చేసుకోండి.

-పుట్టబోయే పిండంపై ప్రభావాల కారణంగా గర్భధారణ సమయంలో ప్రత్యక్ష టీకాలు సురక్షితం కాదు. ఏది ఏమైనప్పటికీ, విపత్కర పరిస్థితులలో వాటి వల్ల కలిగే నష్టాలను ప్రయోజనాలను అంచనా వేయడానికి ప్రసూతి వైద్యుడిని సంప్రదించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం