Weight Loss: వెల్లుల్లి, తేనెల మిశ్ర‌మంతో బ‌రువు త‌గ్గొచ్చా.? ఇందులో నిజానిజాలేంత.? వీటితో క‌లిగే ప్ర‌యోజ‌నాలు..

|

May 13, 2021 | 3:35 PM

Weight Loss: క‌రోనా సంక్షోభ స‌మయంలో ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్లు పూర్తిగా మారిపోయాయి. క‌రోనా రాని వారి కూడా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా తీసుకునే ఆహారంలోమార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా...

Weight Loss: వెల్లుల్లి, తేనెల మిశ్ర‌మంతో బ‌రువు త‌గ్గొచ్చా.? ఇందులో నిజానిజాలేంత.? వీటితో క‌లిగే ప్ర‌యోజ‌నాలు..
Garlic And Honey
Follow us on

Weight Loss: క‌రోనా సంక్షోభ స‌మయంలో ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్లు పూర్తిగా మారిపోయాయి. క‌రోనా రాని వారి కూడా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా తీసుకునే ఆహారంలోమార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తేనెను ఆహారంలో భాగం చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తేనెలో ఉండే మంచి గుణాలే దీనికి కార‌ణం. అయితే తేనెలో వెల్లుల్లి క‌లిపి తీసుకుంటే బ‌రువు త‌గ్గొచ్చ‌ని కొంద‌రు న‌మ్ముతుంటారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ఇప్పుడు తెల‌సుకుందాం..
తెనే, వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇవి జ‌లుబు, బీపీ తగ్గించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. కొంద‌రి అభిప్రాయం ప్ర‌కారం తేనె, వెల్లుల్లి క‌లిపి తీసుకుంటే మెట‌బాలిజ‌మ్ పెరుగుతుంది. అయితే ఇది బ‌రువు త‌గ్గ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిరూప‌ణ మాత్రం లేదు. అయితే ఈ కారణంతో తేనె, వెల్లుల్లిని తీసుకోవ‌ద్ద‌ని చెప్ప‌లేం.. ఎందుకంటే వీటి వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌క‌పోయినా ఇత‌ర లాభాలు మాత్రం క‌చ్చితంగా ఉన్నాయి. వీటివ‌ల్ల‌ క‌లిగే కొన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌పై ఓ లుక్కేయండి..

* వెల్లుల్లిలో విట‌మిన్ బీ6, సీ, ఫైబ‌ర్‌, మాంగ‌నీస్‌, క్యాల్షియం బ‌రువు త‌గ్గ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. ఎలుక‌పై జ‌రిపిన ఓ ప్ర‌యోగంలో వెల్లుల్లి ఇవ్వ‌డం ద్వారా  కొవ్వు త‌గ్గ‌డాన్ని గుర్తించారు.

* ఇక తేనె విష‌యానికొస్తే.. తెనే శ‌రీరంలో గ్లూకోజ్ ఉత్ప‌త్తికి ఉప‌యోగ‌ప‌డుతుంది. గ్లూకోజ్ మెద‌డులో చ‌క్కెర శాతాన్నిపెంచడంతో పాటు కొవ్వు క‌రిగించే హార్మోన్లు విడుద‌ల‌లో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది.

* ఇదిలా ఉంటే వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో ఎట్టి ప‌రిస్థితుల్లో తీసుకోకూడ‌దు. దీని వ‌ల్ల నోటి దుర్వాస‌న‌తో పాటు కడుపులో మంట‌లా ఉండ‌డం, శ‌రీరం దుర్వాస‌న‌, గ్యాస్‌, వాంతులు అయ్యే అవ‌కాశం ఉంటుంది.

* గ‌ర్భిణీలు, శ‌రీరంలో ర‌క్తం గ‌డ్డ‌కట్ట‌కుండా ఉండ‌డానికి ముందులు ఉప‌యోగించే వారు తేనె, వెల్లుల్లి క‌లిపి తీసుకునే ముందు వైద్యుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

Also Read: నల్ల ఎండు ద్రాక్షతో అద్భుత ఫలితాలు..! రక్తహీనత, ఎముకల వ్యాధికి చక్కటి పరిష్కారం..

పెరుగులో బెల్లం కలుపుకొని తినండి..! ఇమ్యూనిటీని ఒక్కసారిగా పెంచుకోండి.. ట్రై చేయండి..

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ డ్రింక్స్ సరైనవే.. రోజూ ఉదయం తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరిగినట్లే..