పాలిచ్చే మహిళలు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవం తర్వాత, శిశువును జాగ్రత్తగా చూసుకునేక్రమంలో చాలామంది మహిళలు తమ సొంత ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. కానీ అలా చేయడం వారి ఆరోగ్యంతో పాటు బిడ్డకు కూడా హానికరం. అటువంటి పరిస్థితిలో, డెలివరీ తర్వాత, మహిళలు తమ స్వంత ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మహిళలు అనేక రకాల సూపర్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోవచ్చు. తల్లిపాలు ఇచ్చే స్త్రీల ఆహారంలో ఏయే ఆహారాలను చేర్చవచ్చో తెలుసుకుందాం. ముఖ్యంగా పండ్లు, పచ్చి కూరగాయలు బాగా తీసుకోవాలి. వీటిలో కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్లు ఎ, సి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. పైగా వీటిలో తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. బాలింతలు ఆకు కూరలను స్మూతీస్ రూపంలో తీసుకుంటే మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు మేరకు పండ్లను కూడా తరచూ తీసుకోవాలి. వీటిని కూడా సలాడ్లు లేదా స్మూతీల రూపంలో తీసుకోవచ్చు. అలాగే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఈ ఆహారాలలో ఐరన్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వు, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. మీరు ఈ డ్రై ఫ్రూట్స్‌ని రాత్రంతా నానబెట్టి ఉంచుకోవచ్చు.
చియా విత్తనాలు
బాలింతుల కచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్‌లో చియా విత్తనాలు ఒకటి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది నవజాత శిశువుల మెదడును అభివృద్ధి చేస్తుంది .చియా విత్తనాలు సాధారణంగా సలాడ్లు, స్మూతీస్ మొదలైన రూపాల్లో తీసుకుంటే లాభం ఉంటుంది.
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్లు ఉంటాయి. పాలిచ్చే స్త్రీలు బొప్పాయిని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తల్లి పాల నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఓట్స్
వోట్మీల్ చాలా తేలికపాటి ఆహారం. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాయి.
చిలగడదుంప
చిలగడదుంపలో విటమిన్ ఎ ఉంటుంది. ఇవి కంటి చూపును పెంచడంలో సహాయపడతాయి. ఎముకలను దృఢంగా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో విటమిన్ ఎ లోపం ఉండదు.
నేరేడు పండు
బాలింతలు నేరేడు పండ్లను తినవచ్చు. ఈ పండ్లలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
ఖర్జూరాలు
ఖర్జూరాలు చాలా ఆరోగ్యకరమైనవి అలాగే రుచికరమైనవి. వీటిలో ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. వీటి రుచి మధురంగా ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..