Bottle Gourd Juice: ఈజీగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.. సొరకాయ జ్యూస్!

| Edited By: Ravi Kiran

Sep 18, 2023 | 8:30 PM

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి సొరకాయ జ్యూస్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఎంతో ఈజీతో పాటు డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వాళ్లే చాలా మంది ఉన్నారు. అధిక బరువు ఉన్న వారు ఒక్కసారే బరువు అస్సలు తగ్గకూడదు. క్రమ క్రమంగా తగ్గుతూ రావాలి కానీ.. ఒక్కసారే బరువు తగ్గితే ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా డైట్ పై, వ్యాయామంపై ఫోకస్ చేయాలి. వ్యాయామం స్టార్ట్ చేసిన రోజే పెద్ద పెద్ద బరువులు, ఎక్సర్ సైజులు చేయకూడదు. తేలిక పాటి నుంచి మొదలు..

Bottle Gourd Juice: ఈజీగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.. సొరకాయ జ్యూస్!
Bottle Gourd Juice
Follow us on

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి సొరకాయ జ్యూస్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఎంతో ఈజీతో పాటు డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వాళ్లే చాలా మంది ఉన్నారు. అధిక బరువు ఉన్న వారు ఒక్కసారే బరువు అస్సలు తగ్గకూడదు. క్రమ క్రమంగా తగ్గుతూ రావాలి కానీ.. ఒక్కసారే బరువు తగ్గితే ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా డైట్ పై, వ్యాయామంపై ఫోకస్ చేయాలి. వ్యాయామం స్టార్ట్ చేసిన రోజే పెద్ద పెద్ద బరువులు, ఎక్సర్ సైజులు చేయకూడదు. తేలిక పాటి నుంచి మొదలు పెట్టాలి. ఇలాంటి వారికి వాకింగ్ బెస్ట్. డైలీ ఉదయాన్నే వాకింగ్ చేస్తూ మీ డైట్ లో చేర్పులు, మార్పులు చేసుకుంటూ.. కంట్రోల్ లో ఉంటే చాలు. ఇలా ఒక్క నెల చేస్తేనే మీలో మార్పును గమనిస్తారు. దీంతో మరింతగా శ్రమిస్తే మీ అధిక బరువు చెక్ పెట్టవచ్చు. అధిక బరువును తగ్గించడంలో సొరకాయ జ్యూస్ బాగా హెల్ప్ చేస్తుంది. మరి అది ఎలా చేయాలి? ఎలా తీసుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సొరకాయ జ్యూస్ కు కావాల్సిన పదార్థాలు:

సొరకాయను, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఓ గిన్నెలో స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని వేడెక్కాక.. సొరకాయను నీటిగా కడుక్కుని కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్క, రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నెక్ట్స్ స్టవ్ ఆఫ్ చేసుకుని.. సొరకాయ ముక్కలు చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఈ జ్యూస్ లో కొద్దిగా సైంధవ లవణం, త్రికట చూర్ణం వేసి బాగా కలుపుకోవాలి. త్రికట చూర్ణాన్ని శొంఠి, పిప్పిళ్లు, మిరియాలు కలిపి తయారు చేస్తారు. ఇది ఆయుర్వేద షాపుల్లో కూడా లభ్యం అవుతుంది. ఇలా తయారైన సొరకాయ జ్యూస్ ను ఉదయం పరగడుపున తాగాలి. పరగడుపున తాగలేని వారు.. బ్రేక్ ఫాస్ట్ పూర్తైన రెండు గంటల తర్వాత తాగాలి.

ఇలా క్రమం తప్పకుండా జ్యూస్ ని తాగుతూ, డైట్ ఫాలో అవుతూ, వ్యాయామాలు చేస్తే తక్కువ సమయంలోనే ఫలితం ఉంటుంది. బరువు తగ్గడంతో పాటు శరీంలో ఉన్న వ్యర్థాలు, మలినాలు కూడా బయటకు పోతాయి. అలాగే కాలేయం శుభ్ర పడుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి