Sprouted Gram And Jaggery Benefits: పప్పు దినుసులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో శెనగలు కూడా ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. అదే సమయంలో.. బెల్లం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు శెనగల్లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. అయితే బెల్లంలో ఐరన్, మెగ్నీషియం మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. మరోవైపు ఈ రెండు ఆహారాలను కలిపి తీసుకుంటే.. మీరు తీవ్రమైన వ్యాధులకు దూరంగా ఉంటారు. మొలకెత్తిన శనగలు, బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మొలకెత్తిన శనగలు, బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
రక్తహీనత దూరమవుతుంది: మీరు శరీరంలో రక్తం లేకపోవడంతో (రక్తహీనత) బాధపడుతుంటే మొలకెత్తిన శెనగలు, బెల్లం తినవచ్చు. ఎందుకంటే ఈ రెండూ ఐరన్‌కు మంచి మూలాలు. దీని కారణంగా రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలను పెరుగుతాయి. ఇది శరీరంలో రక్తహీనతను దూరం చేస్తుంది.
ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి: రోజూ ఒక గుప్పెడు మొలకెత్తిన శెనగలు, బెల్లం కలిపి తీసుకుంటే మీ ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. ఎందుకంటే వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఎముకలను బలంగా చేస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది: మొలకెత్తిన శనగలు, బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతే కాదు మొలకెత్తిన శనగలు, బెల్లం తీసుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కడుపుకు మేలు చేస్తుంది: మొలకెత్తిన శనగలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, దీని కారణంగా జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది. శరీర జీవక్రియ పెరిగి పలు సమస్యలు దూరమవుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..