Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blocked Nose: చలికాలంలో ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్‌ చిట్కాలతో ఉపశమనం పొందండి

ముక్కులో ఉండే అతి సున్నిత త్వచాలు ఉబ్బడంతో ఒక్కోసారి ముక్కు మూసుకుపోయిన భావన కలుగుతుంది. దాంతో ముక్కును బలంగా చీదుతూ ఉండటంతో మరింత వాచిపోతుంది. అలాగే తరచూ నీరు కూడా కారుతూ మనకు మరింత అసౌకర్యాన్ని కలుగజేస్తుంది.

Blocked Nose: చలికాలంలో ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్‌ చిట్కాలతో ఉపశమనం పొందండి
Blocked Nose
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2022 | 7:50 AM

చలికాలం ప్రారంభమైన వెంటనే అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని వేధిస్తాయి.ముఖ్యంగా వాతావారణంలోని మార్పుల వల్ల జలుబు, దగ్గు సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఇక ముక్కులో ఉండే అతి సున్నిత త్వచాలు ఉబ్బడంతో ఒక్కోసారి ముక్కు మూసుకుపోయిన భావన కలుగుతుంది. దాంతో ముక్కును బలంగా చీదుతూ ఉండటంతో మరింత వాచిపోతుంది. అలాగే తరచూ నీరు కూడా కారుతూ మనకు మరింత అసౌకర్యాన్ని కలుగజేస్తుంది.ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏ పనులు కూడా చేసుకోలేం. అయితే  చలికాలంలో ఈ సమస్యలను అధిగమించడానికి ఇంట్లోనే కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటించవచ్చు. ప్రతీసారి డాక్టర్లకు దగ్గరకు వెళ్లకుండానే ఈ టిప్స్‌ పాటించి ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆవిరితో

ముక్కు మూసుకుపోవడం, జలుబు, దగ్గు సమస్యలను అధిగమించేందుకు చాలా ఆయుర్వేద పద్ధతులు ఉన్నాయి. అందులో ఆవిరి విధానం ఒకటి. ఇది చాలా ఉపశమనం ఇస్తుంది. పైగా దీని ప్రభావం కూడా త్వరగా ఉంటుంది. ఇందుకోసం ఒక పాత్రలో నీటిని మరిగించి, ఆ తర్వాత మీ తలను ఒక టవల్‌తో కప్పి, ఆపై ఆవిరి తీసుకోండి. శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. కొందరు వ్యక్తులు విక్స్‌ లేదా అమృతాంజన్‌ని కూడా వేడి నీటిలో కలుపుకుంటారు. దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.

గోరువెచ్చని నీటితో..

ముక్కు మూసుకుపోవడం వల్ల మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే మీరు దీనిని సులభంగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం మీరు వేడి నీటిని తాగడం ప్రారంభించండి. వేగవంతమైన ఫలితాల కోసం, తేనె, అల్లం రసాన్ని వేడి నీటిలో కలుపుకుని తాగాలి. ఇది బ్లాక్ చేయబడిన ముక్కును తెరవడమే కాకుండా, దగ్గును కూడా దూరంగా ఉంచుతుంది

ఇవి కూడా చదవండి

నాసల్ స్ప్రే

ఈ రోజుల్లో అనేక రకాల నాసల్ స్ప్రేలు మార్కెట్‌లో వస్తున్నాయి. అవి బ్లాక్ అయిన ముక్కును తెరుస్తాయి. మీకు కావాలంటే డాక్టర్ సలహాపై వీటిని ఉపయోగించవచ్చు.

స్పైసీ ఫుడ్‌తో

స్పైసీ ఫుడ్ బ్లాక్ చేయబడిన ముక్కును తెరవడంలో మీకు చాలా సహాయపడుతుంది. అలాగనీ మరీ కారం ఉన్న పదార్థాలు అసలు తీసుకోవద్దు. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది.

నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మరిన్ని వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..