Walking Backwards Benefits: వెనక్కి వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు!

| Edited By: Ravi Kiran

Nov 14, 2023 | 10:12 PM

సాధారణంగా ఉదయం ఎవరికి ఉన్న సమయంలో వారు ఎక్సర్ సైజులు, వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తూంటారు. ప్రతి రోజూ కనీసం 20 నిమిషాలైన వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం వాకింగ్ చేయడం వల్ల ఎన్నో దీర్ఘకాలికి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని గురించి ఇప్పటికే మనం తెలుసుకున్నాం. అయితే కేవలం ముందుకే కాదు.. వెనక్కి వాకింగ్ చేయడం వల్ల కూడా చాలా హెల్త్..

Walking Backwards Benefits: వెనక్కి వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు!
Walking
Follow us on

సాధారణంగా ఉదయం ఎవరికి ఉన్న సమయంలో వారు ఎక్సర్ సైజులు, వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తూంటారు. ప్రతి రోజూ కనీసం 20 నిమిషాలైన వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం వాకింగ్ చేయడం వల్ల ఎన్నో దీర్ఘకాలికి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని గురించి ఇప్పటికే మనం తెలుసుకున్నాం. అయితే కేవలం ముందుకే కాదు.. వెనక్కి వాకింగ్ చేయడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా. సాధారణంగా కొందరు వాకింగ్ చేసేటప్పుడు వెనక్కి నడుస్తూ ఉంటారు. అది చూసిన చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు. వెనక్కి నడవడం వల్ల కూడా ఆరోగ్య పరంగా పలు లాభాలు ఉన్నాయని నిపుణు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొవ్వు కరుగుతుంది:

సాధారణంగా ముందుకు వాకింగ్ చేస్తే కొవ్వు కరిగి.. బరువు తగ్గుతారు. అయితే వెనక్కి వాకింగ్ చేయడం వల్ల 40 శాతం ఎక్కువగా శక్తి ఖర్చు అవుతుంది. దీంతో కొవ్వు త్వరగా కరిగేందుకు అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కాళ్ల కండరాలు దృఢంగా ఉంటాయి:

వెనక్కి నడవడం వల్ల కాళ్ల కండరాలు అనేది దృఢంగా మారతాయి. కాలి పిక్కలు, మడమల వద్ద కండరాలు పటుత్వం పెరగాలంటే వెనక్కి నడవడం చాలా మంచిది.

ఫాస్ట్ గా బరువు తగ్గేందుకు ఛాన్స్:

సాధారణంగా వెనక్కి నడవడం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. దీని వల్ల బాడీలో కొవ్వు ఫాస్ట్ గా కరుగుతుంది. దీంతో ఫలితాలు అనేవి త్వరితగతిన ఉంటాయి.

నిద్రలేమి సమస్య తగ్గుతుంది:

రివర్స్ లో వెనక్కి వాకింగ్ చేయడం వల్ల నిద్ర లేమి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా వెనక్కి నడవడం వల్ల ప్రతి ఒక్కరినీ కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్తుంది.

మోకాలి నొప్పులు మాయం:

ఓ అధ్యయనం ప్రకారం.. వెనక్కి వాకింగ్ చేయడం వల్ల మోకాలి నొప్పులు తగ్గుతాయని పేర్కొంది. వెనక్కి పరిగెత్తడం లేదా వాకింగ్ చేయడం వల్ల కార్డియోస్పిరేటరీ బలంగా మారుతుందని పేర్కొన్నారు.

ఏకాగ్రత పెరుగుతుంది:

వెనక్కి నడవడం వల్ల ఉత్సాహంగా ఉంటుంది. రోజూ చేసే వాకింగ్ కంటే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇంకా నడవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దీంతో ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టేలా బ్రెయిన్ మారుతుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.