Ber Fruit Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ ఒక్కరు సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. ఈ క్రమంలోనే అందరూ ఆయా సీజన్స్‌లో లభించే పండ్లు, కూరగాయలు తీసుకుంటుంటారు. అలాంటి సీజనల్‌గా దొరికే పండ్లలో రేగు పళ్లు ఒకటి. సీజన్‌లో వీటిని ప్రతిఒక్కరూ తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. రేగుపళ్లు తీసుకోవడం వలన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్ సమృద్ధిగా అందుతాయి. రేగుపళ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ హ్యూమన్ బాడీకి కావల్సిన పోషకాలను అందిస్తుంది. తక్కువ ధరలోనే దొరికే రేగుపళ్లను ప్రతీ ఒక్కరు తప్పకుండ తినాలి.
రేగుపళ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగి వుంటాయి. రేగుపళ్లు జీర్ణశక్తికి, ఆకలి పెరుగుదలకు, రక్తహీనతను నివారించడానికి ఉపయోగపడతాయి. విసుగు, నీరసం, శ్వాస నాళాల వాపు నెమ్మదించడానికి, గొంతునొప్పికి, హిస్టీరియా లాంటి వ్యాధుల నివారణకు రేగుపళ్లు చక్కటి ఔషధంగా ఉపయోగిస్తారు. చెడుకొలెస్ట్రాల్‌ని కరిగించటంలోనూ రేగుపళ్లు కీలకంగా పనిచేస్తాయి.
రేగుపళ్లు తింటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా వుండేందుకు ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ పండ్లు తినడం మంచిది. ఎందుకంటే రేగుపళ్లు లో క్యాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు ఈ పండ్లు తింటే వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు కీళ్ల మంటల్ని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
రేగుపళ్ల లో ఒత్తిడి తగ్గించే గుణాలు ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. యవ్వనంగా ఉండేట్లు చేస్తాయి. ఇంకా మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి