Benefits of Raw Onions: పచ్చి ఉల్లిపాయతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఎందుకంటే.. ఇందులో అత్యంత విలువైన ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. ఇవి వ్యక్తి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మన దేశంలో ఉల్లిపాయ లేనిదే వంట చేయని వారు ఎందరో ఉంటారు.

Benefits of Raw Onions: పచ్చి ఉల్లిపాయతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!
Raw Onions

Updated on: Jun 17, 2023 | 7:43 PM

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఎందుకంటే.. ఇందులో అత్యంత విలువైన ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. ఇవి వ్యక్తి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మన దేశంలో ఉల్లిపాయ లేనిదే వంట చేయని వారు ఎందరో ఉంటారు. రోజూ కూరల్లో తప్పనిసరిగా ఉల్లిపాయ వేయాల్సిందే. లేదంటే కూర టేస్టే మారిపోతుంది. అయితే, ఇది కూర టేస్ట్ పెంచడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ఉల్లిపాయలో అపారమైన పోషకాలు ఉన్నాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల శరీరానికి 10 కీలక ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తి..

పచ్చి ఉల్లిపాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. సాధారణ వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.

గుండె ఆరోగ్యం..

ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇవి కూడా చదవండి

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు..

పచ్చి ఉల్లిపాయలలోని సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేటరీ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది..

పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ..

ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇది మధుమేహం ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

క్యాన్సర్ నివారణ..

క్వెర్సెటిన్ వంటి పచ్చి ఉల్లిపాయలలో కనిపించే కొన్ని సమ్మేళనాలు.. కడుపు, కొలొరెక్టల్, అండాశయ క్యాన్సర్‌తో సహా కొన్ని రకాల క్యాన్సర్‌ల నుంచి రక్షిస్తాయి.

ఎముకల ఆరోగ్యం..

పచ్చి ఉల్లిపాయల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి, బోలు ఎముకల వ్యాధిని తగ్గించడానికి దోహదం చేస్తుంది.

శ్వాసవ్యవస్థ బలోపేతం..

ఉల్లిపాయలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి, అలెర్జీ, ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మం, జుట్టు ఆరోగ్యం..

పచ్చి ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాలను నివారిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహిస్తాయి.

అధిక బరువు నియంత్రణ..

పచ్చి ఉల్లిపాయలు శరీర బరువును నియంత్రణలో ఉంచేందుకు దోహదపడుతాయి. ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది.

గమనిక: ఉల్లిపాయ అందరికీ ప్రయోజనకరం కాదు. కొందరిలో కడుపులో మంట, ఇతర అసౌకర్యాలను కలిగిస్తుంది. పైన పేర్కొన్న విషయాలు సాధారణ ప్రజా ప్రయోజనాలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యలుంటే వైద్యుల సలహా మేరకే ఉల్లిపాయను తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..