Bay Leaves Benefits: బిర్యానీ ఆకు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

| Edited By: Anil kumar poka

May 04, 2022 | 9:11 AM

మనం చికెన్‌(Chicken), మటన్‌ కర్రీ వండుకుంటే తప్పనిసరిగా బిర్యానీ రైస్ చేసుకుంటాం. బిర్యానీ అంటే అందులో బిర్యానీ ఆకులు(bay leaves) తప్పనిసరిగా వేయాల్సిందే. ఇవి మాంసాహారానికే కాకుండా శాఖాహారానికి కూడా చక్కని రూచిని ఇస్తాయి...

Bay Leaves Benefits: బిర్యానీ ఆకు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
Biryani
Follow us on

మనం చికెన్‌(Chicken), మటన్‌ కర్రీ వండుకుంటే తప్పనిసరిగా బిర్యానీ రైస్ చేసుకుంటాం. బిర్యానీ అంటే అందులో బిర్యానీ ఆకులు(bay leaves) తప్పనిసరిగా వేయాల్సిందే. ఇవి మాంసాహారానికే కాకుండా శాఖాహారానికి కూడా చక్కని రూచిని ఇస్తాయి. దీని వల్ల ఆహారానికి చక్కని రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను అందుతాయి. ఇందులో చాలా ఔషధ లక్షణాలున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ ఆకులో అనేక వ్యాధులను నయం చేసే ఔషధ(Medicine) గుణాలున్నాయని చెబుతున్నారు. శరీరానికి మేలు చేసే పొటాషియం, కాపర్, మెగ్నీషియం జింక్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. బిర్యానీ ఆకులు మానవ శరీరాని ఎంతో మేలు చేస్తాయని.. మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు.

ప్రతి రోజు మనుషులు ఏదో ఒక టెన్షన్‌తో ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. అయితే ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు.. రాత్రి పడుకునే ముందు 2 ఆకులను తీసుకొని దానిని కాల్చి గదిలో ఉంచడం వల్ల దాని లోంచి వచ్చే పొగ కారణంగా ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ వల్ల చాలా మంది శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. ఖచ్చితంగా ఈ బిర్యానీ ఆకులను తినడం వల్ల ఉపసమనం లభిస్తుందని పేర్కొంటున్నారు. ఈ ఆకులను నీటిలో మరిగించి వాటిలో గుడ్డతో ముంచి ఛాతీపై ఉంచితే శ్వాస సమస్య దూరమవుతుందట.

మానవుడు పనిలో నిమగ్నమై రోజు అలసిపోతూ ఉంటారు. అయితే ఈ బిర్యానీ ఆకులను ఉపయోగించి అరోమాథెరపీ చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుందట. ఈ బిర్యానీ ఆకు టైప్- 2 డయాబెటిస్ రోగులకు మంచి ఔషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాధిపై చాలా ప్రభావం చూపుతుంది. ఆకులో ఉండే గుణాల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుందట.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read Also..  World Asthma Day 2022: ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న ఆస్తమా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు