Diabetes: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి.. టైప్-2 డయాబెటిస్‌ కావచ్చు

|

Mar 24, 2022 | 9:14 PM

Diabetes: ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధిలో శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయబడదు..

Diabetes: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి.. టైప్-2 డయాబెటిస్‌ కావచ్చు
Diabetes
Follow us on

Diabetes: ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధిలో శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయబడదు . దీని కారణంగా శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ఇది సమయానికి నియంత్రించబడకపోతే వ్యక్తి శరీరంలో చక్కెర పెరుగుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహం రెండు రకాలు. టైప్‌ -1 (Type 1 Diabetes), టైప్‌ -2 ఇప్పుడు టైప్ 2 డయాబెటిస్ (Type 2 Diabetes) కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 537 మిలియన్ల పెద్దలు ఉన్నారు. ఊబకాయంతో బాధపడే పిల్లల్లో కూడా ఈ రకమైన మధుమేహం కనిపిస్తుంది. అయితే శుభవార్త ఏమిటంటే టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ కమల్‌జిత్ సింగ్ చెబుతున్నారు. అయినప్పటికీ, ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం కాదు. కానీ, దాని లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. రక్తపోటు, ఊబకాయం, మద్యం లేదా ధూమపానం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఈ వ్యాధికి కారణం శరీరంలో తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.

కొన్నిసార్లు ఈ వ్యాధి రావడానికి ఆహారపు అలవాట్లు కూడా కారణం కావచ్చు. ఒక్కసారి మధుమేహం వస్తే అది అంతం కాదు. జీవన వైలిని మార్చుకుని అదులో పెట్టుకోవడమే. ఈ వ్యాధిని నివారించడానికి మంచి జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరం. ఆహారంలో శ్రద్ధ వహించండి. రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయండి. జీవితంలో అనవసరమైన మానసిక ఒత్తిడికి గురికావద్దు. మధుమేహం ఏదైనా కారణం వల్ల సంభవించినట్లయితే, మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. అలాగే వైద్యుల సలహా మేరకు ఆహారంపై శ్రద్ధ వహించండి.

టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ మధ్య వ్యత్యాసం

టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ మధ్య వ్యత్యాసం ఉందని డాక్టర్ చెప్పారు. టైప్ 1 మధుమేహం జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు. ఇందులో చిన్న వయసులోనే మధుమేహం బారిన పడే అవకాశం ఉంది. టైప్-2 మధుమేహం రావడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి లేకపోవడం.

ఇవి టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు

► ఆకలిగా అనిపిస్తుంది

► మబ్బు మబ్బు గ కనిపించడం

► తరచుగా మూత్ర విసర్జన

► ఏదైనా గాయమైతే త్వరగా నయం కాకపోవడ

► ప్రైవేట్ భాగంలో దురద

► చాలా దాహం వేస్తోంది

ఇవి కూడా చదవండి:

Summer Tips: ఈ 6 ఆహారాలు వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి

Women Heart Attack: గుండెపోటు మరణాలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ.. తాజా పరిశోధనలలో సంచలన విషయాలు

Side Effects of Soft Drinks: శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి..?

Heat Stroke: హీట్‌ స్ట్రోక్‌ అంటే ఏమిటి..? ఇది వస్తే శరీరంలోని ఏయే అవయవాలు దెబ్బతింటాయి..?

Health Tips: వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..!