Bananas: అరటిపండుతో లెక్కకు మించిన ప్రయోజనాలు.. కానీ వారికి మాత్రం చాలా అంటే చాలా డేంజర్

| Edited By: Anil kumar poka

Feb 23, 2022 | 7:05 PM

ఒత్తిడికి గురైనా.. కాస్త అలసటగా అనిపించినా..వ్యాయామం చేసిన తర్వాత వెంటనే అరటిపండు తింటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఉపవాస సమయంలో చాలామంది దీన్నే ఆహారంగా తీసుకుంటారు.

Bananas: అరటిపండుతో లెక్కకు మించిన ప్రయోజనాలు.. కానీ వారికి మాత్రం చాలా అంటే చాలా డేంజర్
Bananas
Follow us on

Bananas nutrition facts: అరటిపండు.. సూపర్ టేస్ట్ ఉంటుంది. ధర విషయంలో కూడా అందరికి అందుబాటులో ఉంటుంది. తిన్న వెంటనే ఎనర్జీ ఇస్తుంది. ఒత్తిడికి గురైనా.. కాస్త అలసటగా అనిపించినా..వ్యాయామం చేసిన తర్వాత వెంటనే అరటిపండు తింటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఉపవాస సమయంలో చాలామంది దీన్నే ఆహారంగా తీసుకుంటారు. అరటిపండులో కొవ్వులు, పొటాషియం(potassium), ఫాస్ఫరస్‌, పిండిపదార్థాలు, పీచు,పెప్టిన్‌, సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌, విటమిన్‌-సి(vitamin C), విటమిన్‌-బి6 ఉంటాయి. అరటిపండు ప్రయోజనాలు ఏంటి.. ఎవరికి అరటిపండు అనర్థం వంటి విషయాలు తెలుసుకుందాం పదండి.

ముందుగా ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం…

  1. పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది
  2.  రెండు మూడు మిరియాలు వేసుకుని అరటిపండు తింటే కఫం, దగ్గు తగ్గుతాయి.
  3. అరటిపండులో ఉండే పెప్టిన్‌ పేగులకు మేలు చేస్తుంది. విరేచనం సాఫీగా జరిగేలా చూస్తుంది.
  4. ముదర పండిన అరటిపండు తింటే మలబద్ధకం ఉండదు. పచ్చి అరటిపండు తింటే విరేచనాలు తగ్గుతాయి.
  5. అరటిపండులో ఉండే విటమిన్‌-బి6 హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
  6. ఒళ్లునొప్పులు, వాపులు ఉన్నవాళ్లు తింటే అవి తగ్గుతాయి. పెద్దపేగు పుండుతో బాధపడేవాళ్లు కూడా అరటిపండును తీసుకోవచ్చు.
  7. అరటిపండులో ఉండే ఫాస్ఫరస్‌ ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది.
  8. నెలసరికి ముందు ఆందోళన, ఒత్తిడి, అలసటతో బాధపడేవాళ్లు అరటిపండు తింటే రిలీఫ్ ఉంటుంది
  9. ఎక్కువగా వ్యాయామం చేసేవాళ్లు కండరాలు కృశించిపోకుండా ఉండటానికి బనానా తీసుకుంటారు. దీనిలో ఉండే పొటాషియం వెంటనే శక్తిని పుంజుకునేలా చేస్తుంది.
  10. అరటిపండు తొక్కలో ఉండే తెల్లటి పొరలో కూడా ఔషధ గుణాలుంటాయి.

వీరు మాత్రం అరటిపండు తినకూడదు..

  1.  తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు అరటిపండు తినకూడదు.
  2. అలాగే మధుమేహం, ఆస్తమా, అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నవాళ్లు అరటి తక్కువగా తీసుకోవాలి.
  3. అరటిపండు తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అరటిపండులో పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల గ్యాస్ సమస్యలు ఉన్నవారు అరటిని ఎక్కువగా తీసుకోకపోవడమే బెటర్
  4. ఒక వ్యక్తికి గుండె సంబంధిత సమస్యలు ఉంటే, ఆ వ్యక్తి అరటిపండ్లను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే పొటాషియం మొత్తం అరటిపండులో ఉంటుంది. దీని కారణంగా హైపర్‌కలేమియా వచ్చే ప్రమాదం ఉంది.

Also Read: కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్

లచ్చిందేవి కోట్లతో వచ్చింది.. ఆ మూడు అకౌంట్లలో డబ్బులే డబ్బులు.. కానీ చివరకు