Sleeping Problems: నిద్రపట్టడం లేదా.. అయితే ఈ డ్రింక్ తాగండి.. గాఢంగా నిద్రపోతారు

ఉదయం లేస్తే.. ఆగమేఘాలమీద పనులన్నీ చక్కబెట్టుకుని.. ఒక లంచ్ బాక్స్ తీసుకుని.. రన్నింగ్ బస్సెక్కి ఆఫీసుకెళ్లి.. అక్కడ పనంతా పూర్తిచేసుకుని ఇంటికొచ్చేసరికి రాత్రైపోతుంది. ఇంతా పనిచేశాక పడుకుందామంటే రకరకాల ఆలోచనలు, పనిఒత్తిడి..

Sleeping Problems: నిద్రపట్టడం లేదా.. అయితే ఈ డ్రింక్ తాగండి.. గాఢంగా నిద్రపోతారు
Sleeping Problems

Updated on: Jul 27, 2023 | 10:47 PM

ఉదయం లేస్తే.. ఆగమేఘాలమీద పనులన్నీ చక్కబెట్టుకుని.. ఒక లంచ్ బాక్స్ తీసుకుని.. రన్నింగ్ బస్సెక్కి ఆఫీసుకెళ్లి.. అక్కడ పనంతా పూర్తిచేసుకుని ఇంటికొచ్చేసరికి రాత్రైపోతుంది. ఇంతా పనిచేశాక పడుకుందామంటే రకరకాల ఆలోచనలు, పనిఒత్తిడి, మళ్లీ ఉదయం లేచాక ఏమేం పనులు చేయాలన్న ఆలోచనలు సరిగ్గా నిద్రపోనివ్వవు. అలాంటి వారందరికీ ఈ చిట్కా ఉపయోగపడుతుంది. పెద్దగా ఏం చేయనక్కర్లేదు.

జస్ట్ ఒక డ్రింక్ తాగితే చాలు. డ్రింక్ అంటే ఆల్కహాల్ అనుకునేరు. అస్సలు కాదు. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఒక జ్యూస్. రాత్రి పడుకునే ముందు తాగితే గాఢంగా నిద్ర పట్టడంతో పాటు బీపీ, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. మరి ఆ డ్రింక్ ఏంటో తయారు చేసుకుందామా !

దీని తయారీకి ముందుగా కావలసినవి ఒక అరటిపండు, రెండు ఆప్రికాట్లు, ఒక స్పూన్ పొద్దు తిరుగుడు గింజ‌లు, ఒక స్పూన్ చియా విత్త‌నాలు, ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఒక గిన్నెలో ఒక స్పూన్ పొద్దు తిరుగుడు గింజ‌లు, ఒక స్పూన్ చియా విత్త‌నాలు, రెండు ఆప్రికాట్లు వేసి అవి మునిగేవరకూ నీరుపోసి ఒక గంట పాటు నానబెట్టాలి.

ఇవి కూడా చదవండి

అలా నానబెట్టిన వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. వీటిలో ఒక గ్లాస్ పాలు, తరిగిన అరటిపండు ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి.

ఇలా ప్రతిరోజూ పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే.. నిద్ర త్వరగా పట్టడంతో పాటు.. శరీరానికి కావలసినంత శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి