Baby teeth: పిల్లల్లో పాల దంతాలు ఊడిపోవడానికి కారణం ఏమిటి..? ఇది దేనికి సంకేతం..!

|

Dec 01, 2021 | 9:00 PM

Baby teeth: మనిషి శరీరంలో ప్రతి భాగం కూడా ముఖ్యమైనదే. అవి సక్రమంగా కాపాడుకుంటే ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవిస్తాము. ఇక మనకు పళ్లు కూడా ఎంతో ముఖ్యం. అయితే..

Baby teeth: పిల్లల్లో పాల దంతాలు ఊడిపోవడానికి కారణం ఏమిటి..? ఇది దేనికి సంకేతం..!
Follow us on

Baby teeth: మనిషి శరీరంలో ప్రతి భాగం కూడా ముఖ్యమైనదే. అవి సక్రమంగా కాపాడుకుంటే ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవిస్తాము. ఇక మనకు పళ్లు కూడా ఎంతో ముఖ్యం. అయితే ఇవి చిన్నతనంలో పిల్లల చిరునవ్వు చూడముచ్చటగా ఉంటుంది. అదేసమయంలో చూడముచ్చటైన వారి నోటిలో కనిపించే మొదటి తెల్లని ముత్యాలాంటి పళ్ళ వరస ఉంటుంది. మీ శిశువుకు పాల పళ్ళు ఒక పూర్తిస్థాయి సెట్ ఉంటుంది. అయితే పాల పళ్ళు ఊడిపోయి మరల శాశ్వతంగా వస్తాయని తరచూ తల్లిదండ్రులు కొన్ని నిర్లక్ష్యాలు చేస్తుంటారు. అందువలన పిల్లల పట్ల తల్లిదండ్రులకు అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.

పిల్లల్లో పాల పళ్లు పోవడం దేనికి సంకేతం..

పిల్లల్లో పాల పళ్లు పోవడం అనేది పిల్లల శరీరం సరిగ్గా అభివృద్ధి చెందుతుందనడానికి సంకేతం. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే పళ్లను పాల దంతాలు అంటారు. ఈ పళ్లు పోయిన తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి. పిల్లలకు 20 పాల పళ్లు ఉంటాయి. 6 నెలల వయస్సు నుండి సంవత్సరం మధ్య సమయంలో పళ్ళు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది పిల్లల వయస్సు 3 నుండి 4 సంవత్సరాలు వరకు కొనసాగుతుంది.

వాటి కింద శాశ్వత దంతాలు రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు పాల పళ్ళు ఊడిపోవడం అనేది ప్రారంభం అవుతుంది. కేవలం కింది రెండు ముందు పళ్ళు సుమారు 6 సంవత్సరాల వయస్సు వద్ద వస్తాయి. తర్వాత ప్రతి సంవత్సరం పిల్లలు సుమారు రెండు నుండి నాలుగు పాలు పళ్ళను కోల్పోతారు. బిడ్డ మొదటి జన్మదినం వరకు మొదటి పాలు దంతం తాజా ఊడిపోవడం అనేది రెండూ ఏకకాలంలో జరుగుతాయి. అప్పుడు మీరు సరైన నోటి శుభ్రత, శిశువు పోషణ అలవాట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల క్షయ వ్యాధిని నివారించడానికి మార్గాలు ఉన్నాయి. పిల్లలకు పాల పళ్ళు వచ్చినప్పుడు తరచుగా చిగుళ్ళ గాయాలు, లాలాజలం పెరుగుట, ఆకలి కోల్పోవడం జరుగుతాయి. వారు ఉపశమనం పొందేందుకు ఒక బొమ్మ లేదా వారి వేళ్లను చప్పరించటం వంటివి చేస్తారు. అపరిశుభ్రమైన వస్తువులు, వేళ్లు నమలడం వలన అతిసారం, జ్వరంనకు దారి తీయవచ్చు.

పాల దంతాలు ఎందుకు ఆలస్యంగా వస్తాయి..

పిల్లలు అనారోగ్యంతో ఉన్నట్లయితే మీరు పిల్లల వైద్యులను సంప్రదించాలి. అయితే పాల దంతాల మూలాల నుంచి అసలైన దంతాలు పెరిగేకొద్ది పాల పళ్లు వదులుగా అవుతూ రాలిపోవడం ప్రారంభం అవుతుంది. హైపోపిట్యూటరిజం కారణంగా పిల్లలలో పాల పళ్లు పోవడం అనేది ఆలస్యం కావచ్చు. హైపోపిట్యూటరిజం కారణంగా పిట్యూటరీ తగినంత ట్రోఫిక్‌ హర్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతుంది. ఈ కారణంగా పిల్లల పాల దంతాలు ఆలస్యంగా వస్తాయి. పోషకాలు లేకపోవడం వల్ల పాల దంతాలు కూడా ఆలస్యంగా రాలిపోతుంటాయి. శిశువు నిద్రిస్తున్న సమయంలో పాలు (రొమ్ము పాలు, సీసా పాలు) తాగే సమయంలో కొన్నిసార్లు మింగకుండా కొన్ని పాలు ఉంటాయి. ఇవి దంత క్షయంనకు కారణమయ్యే అవకాశం ఉందని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు సంవత్సరంలో రెండు సార్లు దంత వైద్యులకు చూపించాలి.

ఇవి కూడా చదవండి:

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికే నిద్రించాలి.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు..!

Amla Health Benefits: ఉసిరితో అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..!

Walking Calories: నడకతో ఎలాంటి ఉపయోగాలున్నాయి..? వాకింగ్ వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..?