రాత్రి పూట భోజనం చేసిన తర్వాత పాలు (Milk) తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే చికెన్ లేదా మాంసం తిన్న తర్వాత పాలు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. పాలు, ఉప్పు కలిపిన ఆహారం ఆరోగ్యానికి హానికరంగా పనిచేస్తుందని ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొనబడింది. ఇది చర్మ సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చని చెప్పింది. చికెన్ (Chicken) లేదా ఇతర మాంస పదార్థాలు తిన్న తర్వాత పాలు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. మాంసం, పాలు రెండూ విరుద్ధ పదార్ధాలు. ఇవి రెండూ జీర్ణం కావడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం మాంసం, పాలు, పాల ఉత్పత్తులు వేర్వేరు ఆహారాలు. వీటిని కలిపి తింటే కడుపులో విష ప్రభావం మొదలవుతుంది. ఇది ఉదర సంబంధిత సమస్యలనే కాకుండా చర్మ సమస్యలకూ దారి తీసే అవకాశం ఉంది.
మాంసాహారం, పాలు శరీరానికి ఆరోగ్యకరమని చెబుతున్నప్పటికీ వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. చికెన్‌లో పెరుగు తినడం మంచిది కాదని కూడా అంటారు. ఇలా ఆహారం తీసుకుంటే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చికెన్ తిన్న తర్వాత పాలు తాగకపోవడమే మంచిది.
నోట్.. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.