Health Tips: నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? రాత్రిపూట ఈ పదార్థాలను అస్సలు తీసుకోవద్దు..

|

Sep 21, 2021 | 2:17 PM

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం..

Health Tips: నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? రాత్రిపూట ఈ పదార్థాలను అస్సలు తీసుకోవద్దు..
Healthy
Follow us on

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం.. నిద్రలో మేల్కోవడం.. ఉదయాన్నే త్వరగా నిద్రలేవడంతో చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. అలాగే నిద్ర సరిగ్గా లేకపోతే.. రోజంతా నీరసంగా.. అలసటగా అనిపించడం జరుగుతుంటుంది. ఇక నిద్రలేమి సమస్యకు ప్రధాన కారణం.. మారిన జీవనశైలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా మన నిద్రపై ప్రభావం చూపితుంటాయి. రాత్రిళ్లు నిద్రపోవడానికి ముందు తీసుకునే ఆహార పదార్థాల వలన నిద్రలేమి సమస్య చాలా మందికి కలుగుతుంది.

చాలా మంది రాత్రిళ్లు ఎక్కువగా తినేస్తుంటారు. అల చేయడం చాలా తప్పు. రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకోవడం వలన గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్‏ను పెంచుతుంది. దీంతో గుండెల్లో మంట, వికారం కలిగిస్తుంది. దీంతో సరిగ్గా నిద్రపట్టదు. అందుకే రాత్రి సమయంలో తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. ప్రతి ఒక్కరికి వారి వయసును బట్టి నిద్ర అవసరం… నవజాత శిశవులకు 14-17 గంటలు నిద్ర అవసరం.. అలాగే చిన్న పిల్లలకు 12-15 గంటల నిద్ర అవసరం… పసిపల్లలకు 11-14 గంటలు.. పాఠశాల పిల్లలకు.. 9-11 గంటలు.. కౌమరదశలో ఉన్నవారికి.. 8-10 గంటలు నిద్ర అవసరం. యువతకు 7-9 గంటలు.. పెద్దలకు 7-8 గంటలు నిద్ర అవసరం..

మంచి నిద్రకు సరైన ఆహారం తీసుకోవడం అవసరం. అయితే నిద్రపోవడానికి ముందు కొన్ని ఆహార పదార్థలకు దూరంగా ఉంటే మంచిది. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలు ఆరోగ్యానికి మంచివి.. కానీ వాటిని నిద్రపోవడానికి ముందు అస్సలు తినకూడదు. ఇవి రాత్రిళ్లు త్వరగా జీర్ణం కావు.. అలాగే ఐస్ క్రీమ్.. పడుకునే ముందు అస్సలు తినకూడదు.. ఐస్ క్రీం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే అధిక చక్కెర నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. టమోటాలు కూడా రాత్రిళ్లు తక్కువ పరిమాణంలో తీసుకోవద్దు.. ఇందులోని ఆమైనో ఆమ్లం.. టైరామైన్ కారణంగా నిద్ర సరిగ్గా పట్టదు. ఎర్రమాంసం.. జున్ను కూడా అస్సలు తీసుకోవద్దు. కెఫిన్ పానీయాలకు దూరంగా ఉండాలి. అంటే.. టీ.. కాఫీ వంటివి తీసుకోవద్దు..

Also Read: Tamilnadu CM Stalin: పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం స్టాలిన్.. ప్రజల మధ్యలో సామాన్యుడిలా వాకింగ్

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి ఉచిత దర్శనం షురూ.. దర్శన సమయం పెంపు