Health: మనలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. ఇది సాధారణ తలనొప్పిగా మొదలై తలకు ఒకవైపు విపరీతమైన నొప్పిగా మారుతుంటుంది. మైగ్రేన్ వచ్చిన వారు ఆ తలనొప్పిని భరించలేరు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. వాతావరణం చల్లగా మారితే చాలు వెంటనే తలపోటు మొదలువుతంది. అయితే మైగ్రేన్‌తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆ నొప్పి మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ మైగ్రేన్‌తో బాధపడే వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..
* ప్రస్తుతం వంటకాల్లో టేస్టింగ్ సాల్ట్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ టెస్టింగ్ సాల్ట్‌లో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మైగ్రేన్ నొప్పి పెరగడానికి కారణంగా మారుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్‌ను ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్‌లో వాడుతుంటారు. కాబట్టి మైగ్రేన్‌తో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో దీనికి దూరంగా ఉండాలి.
* మైగ్రేన్‌తో బాధపడేవారు షుగర్ ఫ్రీ పేరిట లభించే పిల్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి కూడా మైగ్రేన్ నొప్పి పెరగడానికి కారణంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
* చాక్లెట్లు తింటే కూడా మైగ్రేన్ సమస్య పెరుగుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారు చాక్లెట్ తింటే మైగ్రేన్ తలనొప్పి ఎక్కువయ్యే అవకాశాలు 22 శాతం పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.
* మైగ్రేన్ సమస్య ఉన్న వారు నిల్వ చేసిన మాంసం తింటే నొప్పి పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మాంసహారాన్ని నిల్వ చేసి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
* కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. సాధారణంగా టీ తాగితే తలనొప్పి తగ్గుతుందని అనుకుంటాం.. కానీ మైగ్రేన్‌తో బాధపడేవారికి మాత్రం నొప్పి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.
* చీజ్ తిన్నా మైగ్రేన్ నొప్పి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చీజ్ తింటే మైగ్రేన్ నొప్పి పెరిగే అవకాశం 35 శాతం వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
Also Read: Telangana: కొడుకు కాదు క్రూరుడు.. బ్రతికుండగానే తల్లికి ఖర్మకాండలు.. కన్నీటి పర్యంతమైన మాతృమూర్తి
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా..! ఎందుకో తెలుసా?
Telangana: పోడు రైతులకు గుడ్ న్యూస్.. భూముల సమస్యకు చెక్.. సీఎం ఆదేశాలు