Brain Health: మెదడు పనితీరు మెరుగుపడాలంటే.. ఈ అలవాట్లను విడిచిపెట్టాల్సిందే..

|

Jul 04, 2022 | 1:31 PM

Brain Health: మెదడు మన శరీరంలో ముఖ్యమైన భాగం.శరీరంలోని మిగిలిన అవయవాల గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామో, మన మెదడు పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. మన రోజువారీ జీవితంలోని తెలియకుండా చేసే కొన్ని పనులు, అలవాట్లు మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి

Brain Health: మెదడు పనితీరు మెరుగుపడాలంటే.. ఈ అలవాట్లను విడిచిపెట్టాల్సిందే..
Brain Health Tips
Follow us on

Brain Health: మెదడు మన శరీరంలో ముఖ్యమైన భాగం.శరీరంలోని మిగిలిన అవయవాల గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామో, మన మెదడు పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మన రోజువారీ జీవితంలోని తెలియకుండా చేసే కొన్ని పనులు, అలవాట్లు మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువై మానసిక ప్రశాంతత కరువవుతుంది. మరి మెదడు పనితీరును దెబ్బతీసే ఆ పనులు, అలవాట్లేంటో తెలుసుకుందాం రండి.

ధూమపానం, మద్యపానం

మెదడు పనితీరు మెరుగుపడాలంటే ధూమపానానికి దూరంగా ఉండాలి. పొగాకు సంబంధిత పదార్థాలు మన మెదడు కణాలను దెబ్బతీస్తాయి. అధిక ధూమపానం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుది. సిగరెట్లు లాంటి మత్తు పదార్థాలు మన ఆరోగ్యాన్నే కాదు మన మెదడును దెబ్బతీస్తాయి. అదేవిధంగా మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి

ఇవి కూడా చదవండి

ఒత్తిడి..

ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ కారణంగా ప్రజలు తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అనవసరంగా ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల మన మెదడుకు చాలా నష్టం జరుగుతుంది. జ్ఞాపకశక్తి బలహీనపడడం ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. వీలైనంతవరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. యోగా, ధ్యానం వంటి వాటిని లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవాలి.

బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్‌ చేయడం..

యాంత్రిక జీవనంలో పడో, సమయం లేదనో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్‌ చేస్తుంటారు. ఇది శరీరంపైనే కాదు మెదడుకు కూడా తీవ్ర హాని చేస్తుంది. ఎందుకంటే మెదడు పనిచేయాలంటే ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈక్రమంలో మెదడు పనితీరును మెరుగుపరచుకోవాలంటే పోషకాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం ఎంతోముఖ్యం.

నిద్రలేమి

ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజూ కనీసం 7 నుంచి 8గంటల పాటు నిద్రపోవాలి. ఉద్యోగాలు చేయడం వల్లనో లేక ఇతర కారణాల వల్లనో ఈ రోజుల్లో చాలా మంది అర్ధరాత్రిళ్ల వరకు మేల్కొంటున్నారు. దీనివల్ల మెదడు కణాల పెరుగుదల ఆగిపోతుంది. ఫలితంగా రోజంతా ఒత్తిడి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..