Ash Gourd: బూడిద గుమ్మడి దిష్టికే కాదు.. ఆరోగ్య పుష్టికీ బెస్టే!

బూడిద గుమ్మడి తెలియని వారుండరు. సాధరానంగా వీటిని దిష్టి తీయడానికో.. వడియాలు పెట్టుకోవడానికో వినియోగిస్తుంటాం. కొందరు హల్వా, ఆగ్రా పేఠా... వంటి స్వీట్లూ కూడా చేస్తారు. చాలా మటుకు బూడిద గుమ్మడి కాయలను ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కడుతుంటారు. నిజానికి బూడిదగుమ్మడి పాదు ఇంటి పెరట్లో ఉంటుంది. కానీ కాయల్ని వడియాలు పట్టుకోవడానికి తప్ప ఇంక దేనికీ వాడరు సరికదా, దానం ఇస్తే పుణ్యం వస్తుందనుకుంటారు..

Ash Gourd: బూడిద గుమ్మడి దిష్టికే కాదు.. ఆరోగ్య పుష్టికీ బెస్టే!
Ash Gourd

Updated on: Aug 19, 2024 | 12:46 PM

బూడిద గుమ్మడి తెలియని వారుండరు. సాధరానంగా వీటిని దిష్టి తీయడానికో.. వడియాలు పెట్టుకోవడానికో వినియోగిస్తుంటాం. కొందరు హల్వా, ఆగ్రా పేఠా… వంటి స్వీట్లూ కూడా చేస్తారు. చాలా మటుకు బూడిద గుమ్మడి కాయలను ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కడుతుంటారు. నిజానికి బూడిదగుమ్మడి పాదు ఇంటి పెరట్లో ఉంటుంది. కానీ కాయల్ని వడియాలు పట్టుకోవడానికి తప్ప ఇంక దేనికీ వాడరు సరికదా, దానం ఇస్తే పుణ్యం వస్తుందనుకుంటారు. అయితే గుమ్మడిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయనే సంగతి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా బూడిద గుమ్మడిలోని గుణాలు మెదడు పనితీరుని పెంచుతాయి. లేతగా ఉన్నప్పుడు- బూడిద గుమ్మడికాయకి నూగులాంటి వెంట్రుకలు ఉంటాయి. ముదిరేకొద్దీ అవి పోయి బూడిదను పులుముకుంటుంది. అందువల్లనే దీనికి బూడిద గుమ్మడి అనే పేరు వచ్చింది.

అన్ని సీజన్లలో దొరకడమేకాకుండా.. ధర కూడా చౌకగా ఉంటుంది. గుమ్మడికాయలో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం, జింక్ మొదలుకొని అనేక విధాలైన విటమిన్లు, పోషకాలు, మినరల్స్‌ ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడేందుకు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే బూడిద గుమ్మడికాయలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపణులు. పైగా ఇందులో తగినంత ఫైబర్, అధికంగా నీరు ఉంటాయి. ఇందులోని పోషకాలు పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సమస్యలతో బాధపడేవారు బూడిద గుమ్మడి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఆఫీస్‌ పనుల వల్ల అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు.. తక్షణ శక్తి కోసం గుమ్మడి కాయ జ్యూస్‌ తాగొచ్చు. ఇందులో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ శీఘ్ర శక్తిని అందిస్తుంది.

అల్సర్ అంటే పొట్టలో ఏర్పడే పుండ్లు. కానీ గుమ్మడికాయను రెగ్యులర్ గా తినడం వల్ల ఈ సమస్య త్వరగా నయం అవుతుంది. కాబట్టి అల్సర్ బాధితులు తప్పనిసరిగా గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకోవాలి. గుమ్మడికాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో శరీరాన్ని చల్లగా ఉంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.