Non-stick Cookware Side Effects: మీరు నాన్ స్టిక్ పాన్స్ ని వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!!

| Edited By: Ravi Kiran

Sep 11, 2023 | 9:00 AM

మారుతున్న కాలం ప్రకారం.. అందరూ కొత్త జీవనానికి అలవాటు పడుతున్నారు. టెక్నాలజీ కూడా పెరుగుతుంది. ఇంట్లో, వంటింట్లో కొత్త కొత్త వస్తువులు వస్తున్నాయి. ఈ క్రమంలో గృహిణులకు హెల్ప్ చేసే నాన్ స్టిక్ పాన్స్ వచ్చాయి. వేపుళ్లకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేయకుండా, మాడకుండా ఉంటాయి. దీంతో ఆడవాళ్లందరూ వీటికే ఓటు వేశారు. చాలా మంది ఇప్పుడు ఈ నాన్ స్టిక్ పాన్సే వాడుతున్నారు. అందులో ఈ నాన్ స్టిక్ పాన్స్ పై దోశలు వేస్తే తక్కువ ఆయిల్ తో క్రిస్పీగా, సాఫ్ట్ గా వస్తాయి. అయితే కొన్ని రోజులకు వీటిపై ఉన్న కోటింగ్ ఊడిపోయి చూడటానికి బాగోవు. అలాంటి వాటిని..

Non-stick Cookware Side Effects: మీరు నాన్ స్టిక్ పాన్స్ ని వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!!
Non Stick Pan
Follow us on

మారుతున్న కాలం ప్రకారం.. అందరూ కొత్త జీవనానికి అలవాటు పడుతున్నారు. టెక్నాలజీ కూడా పెరుగుతుంది. ఇంట్లో, వంటింట్లో కొత్త కొత్త వస్తువులు వస్తున్నాయి. ఈ క్రమంలో గృహిణులకు హెల్ప్ చేసే నాన్ స్టిక్ పాన్స్ వచ్చాయి. వేపుళ్లకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేయకుండా, మాడకుండా ఉంటాయి. దీంతో ఆడవాళ్లందరూ వీటికే ఓటు వేశారు. చాలా మంది ఇప్పుడు ఈ నాన్ స్టిక్ పాన్సే వాడుతున్నారు. అందులో ఈ నాన్ స్టిక్ పాన్స్ పై దోశలు వేస్తే తక్కువ ఆయిల్ తో క్రిస్పీగా, సాఫ్ట్ గా వస్తాయి. అయితే కొన్ని రోజులకు వీటిపై ఉన్న కోటింగ్ ఊడిపోయి చూడటానికి బాగోవు. అలాంటి వాటిని వాడకపోవడమే బెటర్. అయితే వీటిని క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇతర గిన్నెలు వాష్ చేసినట్లు.. ఇవి చేస్తే వాటి కోటింగ్ పోతాయి. అలా అవ్వకుండా.. ఇవి ఎక్కువ రోజులు రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

నూనె అస్సలు వాడకూడదు:

నాన్ స్టిక్స్ పాత్రలు వాడేపట్టప్పుడు నూనె అస్సలు వాడకూడదని చెబుతారు. అయితే కొద్ది మొత్తం లో ఆయిల్ ని వాడవచ్చు. కొంచెం నూనె పాన్ మొత్తం స్ప్రెడ్ చేసి.. ఆ తర్వాత పేపర్ తో పాన్ అంతా తుడవాలి.

ఇవి కూడా చదవండి

ఎసిడిక్ ఫుడ్స్ ని వాడకూడదు:

నాన్ స్టిక్ పాన్స్ లో ఎసిడిక్ ఫుడ్స్ ని చేయకూడదు. అలా చేస్తే వాటి కోటింగ్ త్వరగా పోతుంది.

ఎక్కువగా వాడకూడదు:

నాన్ స్టిక్ పాత్రలు బావుంటున్నాయి కదా అని అన్నింటికి వాటినే వాడకూడదు. ఎక్కువ ఆహారాలు వండి.. ఎక్కువగా వాష్ చేస్తే వాటిపై ఉండే నాన్ స్టిక్ పొర ఊడిపోతుంది.

మెటల్ స్పూన్స్ – కత్తులు వాడకూడదు:

నాన్ స్టిక్ వాడేటప్పుడు మెటల్ స్పూన్స్, పదునైన కత్తులు వాడకూడదు. కత్తులని వాడటం వల్ల నాన్ స్టిక్ తవాపై పొర ఊడి వచ్చే ప్రమాదం ఉంది.

మీడియం మంట మీదనే వాడాలి:

నాన్ స్టిక్ పాత్రలను హై ఫ్లేమ్ లో ఉంచకూడదు. ఈ పాన్స్ తక్కువ, మధ్యస్థ వేడికి అనుకూలంగా ఉంటాయి.

నాన్ స్టిక్ పాన్స్ ని ఇలా క్లీన్ చేయాలి:

ఈ పాత్రలను సబ్బు నీటితో క్లీన్ చేయవచ్చు. ఆ తర్వాత మెత్తని స్పాంచ్ తో క్లీన్ చేసుకోవాలి. అలాగే పదునైన అంచులు ఉన్న కంటైనర్ మధ్యలో వీటిని పెట్టకూడదు. వీటికంటూ సపరేట్ ప్లేస్ ఉండాలి. వీటిని వంట చేసిన వెంటనే కడగకూడదు. కాసేపు నీటిలో నానబెట్టి కడగాలి.

ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే.. నాన్ స్టిక్ పాన్స్ ఎక్కువ రోజులు వస్తాయి. అయితే ఈ నాన్ స్టిక్ పాన్స్ ని వాడితే క్యాన్సర్ వస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు కూడా చెప్పాయి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ కానీ.. బెనిఫిట్స్ ఉండవని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి