
ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. దీంతో లైఫ్ స్టైల్ లో వచ్చే మార్పులను కూడా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు స్మార్ట్ వాచ్ ల ట్రెండ్ నడుస్తుంది. ఎక్కడ చూసినా.. ఎవరి చేతికి చూసినా.. స్మార్ట్ వాచ్ లే కనిపిస్తున్నాయి. పేరుగు తగ్గట్టుగానే ఎంతో స్మార్ట్ గా వర్క్ అవుతుంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ లతోకూడా కొన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. స్మార్ట్ ఫోన్ వాడకం వలన రోజూ దాదాపు పది వేల బ్యాక్టీరియాలు శరీరంలోని ప్రవేశిస్తున్నాయట. దీంతో చాలా మంది జబ్బు పడుతున్నారని.. ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా శరీరంలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. అయితే శరీరంలో ఉండే ఇమ్యూనిటీ కారణంగా.. చెడు బ్యాక్టీరియా కంటే మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. దీంతో మనం కూడా సేఫ్ గా ఉంటున్నాం. కానీ ఎవరైతే ఎక్కువగా జబ్బుల బారిన పడుతున్నారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిందంటే.. అనేక అనారోగ్య సమస్యలు, వ్యాధులు చుట్టుముట్టేస్తాయి.
ఫ్లోరిడాలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా ఎక్కువగా.. మనకు తెలియకుండానే శరీరంలోకి ప్రవేశిస్తుందని తేలింది. ఉదయం లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్ లు ఉపయోగిస్తూనే ఉంటున్నారు. వీటిపై ఎండ, దుమ్ము, ధూళి చేరతాయి. అలాగే టాయిలెట్ లోకి వెళ్లినా.. బయటకు ఎక్కడికి వెళ్లినా ఈ స్మార్ట్ వాచ్ లు ఉంటాయి. ఇలా చెడు బ్యాక్టీరియా వాచ్ లపై చేరి.. మీకు తెలీకుండానే శరీరంలోకి చేరుతోంది. ప్రమాదకరమైన సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్, సూడోమోనాస్ వంటి బ్యాక్టీరియాలు చేరుతున్నాయి.
అయితే ఈ బ్యాక్టీరియా సంఖ్య కూడా రిస్ట్ బ్యాండ్ ల బట్టి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ప్లాస్టిక్, రబ్బర్ వంటి వాటిపైకి ఈ బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. వీటి ద్వారా వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్లాస్టిక్, రబ్బర్ వంటివి కాకుండా మెటాలిక్ రిస్ట్ బ్యాండ్ తో వచ్చే వాచ్ లను వాడితే చాలా మంచిది. స్మార్ట్ వాచ్ ధరించే వారు.. బాత్ రూమ్ లకు వెళ్లే ముందు తీసి పక్కన పెట్టుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.