Betel Leaf Benefits: యూరిక్ యాసిడ్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే తమల పాకుతో చెక్ పెట్టండి!

| Edited By: Ravi Kiran

Oct 10, 2023 | 7:25 AM

ఇప్పుడు అనేకనాక కొత్త అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోమోనని చాలా మంది భయ పడుతున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎప్పుడూ వినని కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా ఈ కాలంలో వినాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. అనేకనేక కారణాల వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి..

Betel Leaf Benefits: యూరిక్ యాసిడ్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే తమల పాకుతో చెక్ పెట్టండి!
Betel Leaf 1
Follow us on

ఇప్పుడు అనేకనాక కొత్త అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోమోనని చాలా మంది భయ పడుతున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎప్పుడూ వినని కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా ఈ కాలంలో వినాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. అనేకనేక కారణాల వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఒక సమస్య కారణంగా ఇంకా అనేక ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి ఎక్కువగా ఉంటే కీళ్ల నొప్పులు, మూత్ర పిండాల్లో రాళ్లు, గౌట్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

యూరిక్ యాసిడ్ లెవల్స్ ఒక్కసారి పెరిగాయంటే.. తగ్గించడం చాలా కష్టం. ఇవి తగ్గాలంటే ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించడం మంచిది. లేదంటే తీవ్ర సమస్యల్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. అయితే యూరిక్ యాసిడ్ లెవల్స్ ని అదుపు చేసే గుణాలు తమల పాకులో మెండుగా ఉన్నాయి. వైద్యులు సలహాలు, మెడిసిన్ తీసుకుంటూనే.. తమల పాకు చిట్కాలను పాటించవచ్చు. ఇలా చేయడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తమల పాకుతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తమల పాకును సరైన విధంగా ఉపయోగిండం వల్ల రక్త పోటు, మధు మేహం వంటి వాటిని కూడా అదుపులోకి తీసుకు రావచ్చు.

తమల పాకుతో యూరిక్ యాసిడ్ ఎలా కంట్రోల్ చేయవచ్చంటే:

ఇవి కూడా చదవండి

* తమల పాకు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తమల పాకును క్రమం తప్పకుండా నమిలి తింటూ ఉంటే యూరిక్ యాసిడ్ సమస్యను అదుపులోకి తీసుకు రావచ్చు.

* రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి.. అందులో తమల పాకును ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని నానబెట్టాలి. ఈ నీటిని ఉదయం తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి తగ్గుతాయి.

* అలాగే తమల పాకులను చిన్న గిన్నెలో వేసి, ఆ తర్వాత నీళ్లు పోసి ఓ ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. అంతే కాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లోకి వస్తాయి.

అయితే వైద్యుల సలహాలు తీసుకుంటూనే.. తమల పాకు చిట్కాలను ట్రై చేయవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.