రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన సమస్య కొంతమంది ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అయితే.. తరచూ యూరినేషన్ సమస్యను చాలామంది విస్మరిస్తూ వస్తుంటారు. అయితే, అలా చేయడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జన అనేది.. మూత్రాశయం, మూత్రపిండాలు లేదా శరీరంలోని పలు అవయవాల పని తీరులో ఏదో ఒక సమస్య ఉందని అర్థం అని పేర్కొంటున్నారు. శరీరంలో తలెత్తే ఏ సమస్య, వ్యాధి తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుందో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటే ముందుగా మూత్రాశయాన్ని పరీక్షించుకోవాలి. మూత్రాశయం లోపల రాళ్లు ఉండటం వల్ల తరచుగా మూత్రవిసర్జన అవుతుంది. వాస్తవానికి ఇది మూత్ర విసర్జనలో అడ్డంకి మారుతుంది. దీనివల్ల కూడా తరచుగా మూత్రం వస్తుంది.
ప్రోస్టేట్ గ్రంధి విస్తరణ అనేది పురుషులలో సాధారణ సమస్య. ప్రోస్టేట్ గ్రంధి విస్తరణ మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది ఒక్కోసారి అధిక మూత్రవిసర్జనకు కారణమవుతుంది.
అధిక మూత్ర విసర్జనకు మధుమేహం కూడా కారణం కావచ్చు. మధుమేహం ఎక్కువగా ఉన్నప్పుడు రక్తంలో అదనపు గ్లూకోజ్ పేరుకుపోతుంది. దీని కారణంగా మూత్రపిండాలు అదనపు గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేయడానికి, గ్రహించడానికి ఓవర్‌టైమ్ పని చేస్తాయి.
మూత్రపిండ వ్యాధులు తరచుగా మూత్ర వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కిడ్నీ స్టోన్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ డ్యామేజ్ వంటి అనేక సమస్యలు తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతాయి.
UTI సంక్రమణ కూడా తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. ఇది మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగంలో (మూత్రనాళం, మూత్రాశయం, మూత్రపిండాలు) సంభవించవచ్చు. ఈ సమస్య కారణంగా మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి కూడా అనిపిస్తుంది.
మీరు కూడా తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటే.. జాగ్రత్తగా ఉండాలని.. ముందుగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..