సెప్టిక్ ఎంబోలి అనేది అరుదైన వ్యాధి. తాజాగా, బెల్జియంలో ట్రైనీ పైలట్ నుదిటిపై దోమ కాటుకు గురై ఇన్‌ఫెక్షన్‌తో మరణించిన ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు దోమకాటుతో ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో న్యూ ఢిల్లీలోని AIIMS ప్రొఫెసర్స్ కొన్ని కీలక సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. దోమలు కుట్టిన ప్రదేశంలో దురదగా అనిపిస్తే గోళ్లతో గోకకూడదంట. ఇలా చేస్తే అది ఇన్ఫెక్షన్‌ను వ్యాప్తి చేస్తుంది. శరీరంలో యాంటీబయాటిక్ నిరోధకత కూడా పరిస్థితిని మరింత దిగజార్చుతుందని వారు తెలిపారు. కాబట్టి దోమ కుట్టిన చోట, ఎంత దురదగా ఉన్నా సరే.. దానిని గోళ్లతో రుద్దకుండా ఉంటే, ఇలాంటి వ్యాధి బారిన పడుకుంటా ఉంటాం.
సెప్టిక్ ఎంబోలి అంటే..
సెప్టిక్ ఎంబోలి అనేది రక్త నాళాల ప్రవాహాన్ని అడ్డుకోవడంగా చెబుతున్నారు. కొన్నిసార్లు ఇది రక్తనాళాల నుంచి మెదడుకు చేరుకుంటుంది. రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది ఆకస్మిక మరణానికి దారితీస్తుంది.
కారణాలు..
ప్రాథమికంగా, రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా సెప్టిక్ ఎంబోలి వచ్చే ప్రమాదం ఉంది. బ్లడ్ ఇన్‌ఫెక్షన్‌కి కారణం లేదని తేలింది. కానీ, దానికి చాలా కారణాలు ఉండవచ్చు.
లక్షణాలు..
ఆయాసం, జ్వరం, తల తిరగడం, గొంతు నొప్పి, నిరంతర దగ్గు, వాపు, శ్వాస ఆడకపోవడం, వెన్నునొప్పి ప్రధాన లక్షణాలుగా చెబుతున్నారు. వృద్ధులు, కృత్రిమ హృదయాలు, కవాటాలు లేదా పేస్‌మేకర్లు ఉన్నవారు, కాథెటర్ ఉన్నవారితోపాటు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఎలా నిర్ధారిస్తారు..
బ్లడ్ ఇన్ఫెక్షన్ రక్తంలో జెర్మ్స్ ఉనికిని పరీక్షించవచ్చు. బాక్టీరియాను గుర్తించడం ద్వారా కూడా గుర్తించవచ్చు.
చికిత్స..
సాధారణంగా చికిత్సలో యాంటీబయాటిక్ ఔషధం ఇస్తుంటారు. కానీ, చాలా మంది రోగులలో యాంటీబయాటిక్ ప్రభావం శరీరం జీవ స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది.