వాలెట్ లేదా పర్స్.. దీన్ని ఎక్కువగా అబ్బాయిలు వినియోగిస్తూ ఉంటారు. పర్సును చాలా మంది మగవారు ప్యాంట్ వెనుక జేబులో పెడుతూంటారు. ఎందుకుంటే పెట్టుకోవడానికి.. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే ఫ్రంట్ జేబులో పెట్టుకుంటే.. ప్యాట్ టైట్ గా ఉంటుంది. దీంతో తీయడం కష్టంగా మారింది. కాబట్టి చాలా మంది ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూంటారు. ఇలా వెనుక జేబులో పెట్టుకోవడం వల్ల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతూంటాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్యాంట్ వెనుక పాకెట్ లో పెట్టుకోవడం వల్ల పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని అంటున్నారు వైద్యులు. ఎక్కువ సేపు ప్యాంట్ వెనక జేబులోనే పర్స్ ను పెట్టుకోవడం వల్ల ‘ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్’ అనే వ్యాధి వస్తుందట. మరి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెడ, వెన్ను సమస్యలు:
ప్యాంట్ వెనుక పాకెట్ లో పెట్టడం వల్ల భుజాలు, మెడ, వెన్ను సమస్యలు వస్తాయి. ఇప్పటికే చాలా మంది ఈ సమస్యలను ఫేస్ చేసే ఉంటారు. చాలా మంది వాలెట్ లో ఎన్నో రకాల కార్డ్స్, డబ్బులు, బిల్స్ వంటివి అందులోనే పెడుతూంటారు. చాలా మంది అనవసరం అయినవి కూడా ఉంచుతారు. దీంతో పర్స్ అనేది బరువు పెరుగుతుంది. అలా కంటిన్యూగా బరువైన వాలెట్ ను వెనుక పాకెట్ లో ఉచుకోవడం వల్ల ఈ సమస్యలు అనేవి వస్తూంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. కానీ దీని కారణం అనేది చాలా మందికి తెలీదు.
కీళ్లు ఒత్తిడికి గురి అవుతాయి:
బరువు వాలెట్ ను వెనుక జేబులో ఉంచుకోవడం వల్ల తుంటి ఎముకలోని కండరాలు, కీళ్లు ఒత్తిడికి గురవుతాయి. అంతే కాకుండా బరువు ఉండటం వల్ల ఆటో మెటిక్ గా చాలా మంది ఒక వైపుకు వంగి నడుస్తూంటారు. ఈ విషయాన్ని ఎవరూ సరిగ్గా గమనించరు. ఈ కారణంగా వెన్ను పూసపై ప్రభావం పడే అవకాశం ఉంది.
వాలెట్ బరువు తగ్గించుకోవాలి:
ప్రస్తుతం ఫోన్ లోని యాప్స్ ద్వారా చాలా పనులు అవుతున్నాయి. కాబట్టి వాలెట్ అవసరం అయినవి తప్పించి.. మిగిలినవి వదిలేయడం మంచిది. అలేగే ఎప్పటికప్పుడు పనికి రాని బిల్స్ ను తొలగించుకుంటూ ఉండారు. దీని వల్ల వాలెట్ బరువు అనేది కాస్త తగ్గుతుంది. దీంతో మెడ, వెన్ను, కాళ్లు, భుజాల సమస్యలను నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.