AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ గుండెకి ఇది బ్రహ్మాస్త్రం.. రోజూ ఇలా చేశారంటే వందేళ్లు హాయిగా బ్రతికినట్టే.!

రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైన నిద్రపోతున్నారా? లేదంటే.. మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని డాక్టర్లు చెబుతున్నారు. రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైన నిద్రపోని వారిలో..

Health Tips: మీ గుండెకి ఇది బ్రహ్మాస్త్రం.. రోజూ ఇలా చేశారంటే వందేళ్లు హాయిగా బ్రతికినట్టే.!
Heart pain
Ravi Kiran
|

Updated on: May 21, 2024 | 3:32 PM

Share

రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైన నిద్రపోతున్నారా? లేదంటే.. మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని డాక్టర్లు చెబుతున్నారు. రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైన నిద్రపోని వారిలో గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదని అన్నారు. ఇటీవల ఓ 4 వేల మంది పురుషులు, మహిళలపై పలు పరీక్షలు చేసిన పరిశోధకులు.. రాత్రి వేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఆరు అంతకంటే ఎక్కువ సమయం నిద్రించిన వారిలో ఈ సమస్య అంతగా లేదని గుర్తించారు. అందుకే సరైన నిద్ర అవసరం. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులు ఉన్నా.. నిద్రించే సమయాన్ని కాస్త కేటాయిస్తే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. కంటి నిండా నిద్ర లేదంటే అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ వార్త కేవలం పలు అధ్యయనాలు, వైద్య నిపుణుల రీసెర్చ్ ఆర్టికల్స్ ఆధారంగా ప్రచురించింది మాత్రమే. మీరు ఏదైనా డైట్ ఫాలో కావాలన్నా.. స్లీప్ ప్యాట‌్‌రన్స్‌‌ మార్పు కావాలన్నా డాక్టర్ సలహా కచ్చితంగా తీసుకోండి. 

Follow Us
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..