మన ఇంట్లో.. మనం రోజూ కూరలు వండేందుకు వాడే పదార్థాలు, కూరగాయలతోనే.. మన ముఖ, చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. వాటికోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరిగి వేలకు వేలు వెచ్చించనక్కర్లేదు. ఈ ఒక్క ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు ముఖం, మెడకు కలిపి వేసుకుంటే మచ్చలు, నలుపు, ట్యాన్ తో పాటు మృతకణాలు కూడా తొలగిపోయి.. ముఖం అందంగా, కాంతివంతంగా ఉంటుంది. మరి ఇంతకీ ఏంటా ఫేస్ ప్యాక్.. ఎలా తయారు చేసుకోవాలి.. తెలుసుకుందామా.
ఈ ఫేస్ ప్యాక్ కోసం కావలసిన పదార్థాలు ఒక బంగాళదుంప (potato), రెండు స్పూన్ల కలబంద గుజ్జు (Aloe vera gel), 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి లేదా శనగపిండి (besan powder), చిటికెడు పసుపు.
బంగాళుంపపై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని.. మిక్సీజార్ లో వేసుకోవాలి. అలాగే తాజా కలబంద గుజ్జు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని.. ఇందులో బియ్యంపిండి లేదా శనగపిండి, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోవాలి.
లైట్ గా డ్రై అయ్యాక చేతివేళ్లతో స్క్రబ్ చేస్తూ.. పూర్తిగా ఆరేంత వరకూ ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. ముఖంపై ఉండే జిడ్డు, మృతకణాలు, మురికి తొలగిపోయి..మృదువుగా మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది. ఇలా తక్కువ ఖర్చుతోనే ముఖంపై పేరుకున్న టాన్ ను తొలగించుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి