Cinnamon : దాల్చిన చెక్క.. ఇది అందరికీ తెలిసిన మసాలా దినుసుల్లో ఒకటి.. వంటకాల్లో దాల్చిన చెక్కను వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుంది. అంతేకాకుండా దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం..దాల్చిన చెక్కలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని చెబుతారు. దాల్చిన చెక్కతో అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చిన చెక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. ముఖ్యంగా తలనొప్పితో బాధపడే వారు దాల్చిన చెక్కను నీటితో అరగదీసి ఆ మిశ్రమాన్ని నుదుటి పై రాసి 5 నిమిషాల పాటు మర్దనా చేయడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. గొంతు బొంగురు పోయినప్పుడు దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ రసాన్ని మింగడం వల్ల గొంతు బొంగురు తగ్గిపోతుంది.దగ్గు కూడా తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను నేరుగా తిన్నా లేదా దాల్చిన చెక్క పొడిని నీటిలో కలుపుకుని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు .. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా నీళ్లు, తేనె కలిపి పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న చోట రాయాలి. ఇలా రాత్రి పూట చేయాలి. దీంతో మరుసటి రోజు ఉదయం వరకు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి.
మధుమేహం బాధితులకు కూడా దాల్చిన చెక్క ఔషధంలా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపున అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చని నీటితో కలిపి తాగాలి. అనంతరం 30 నిమిషాలు ఆగాక బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా 40 నుంచి 45 రోజుల పాటు చేస్తే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అంతేగాకుండా గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. దాల్చినచెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రకరకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. దీన్ని ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్త సరఫరా మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
దీన్ని వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు, చుండ్రు తగ్గుతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం తీసుకుని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మొటిమలు, బ్లాక్ హెడ్స్‌పై రాత్రి పడుకునే ముందు అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. ఇలా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాదులను, నోటి పుండ్లను నివారించడంలో గొప్ప పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. అందుకే దీన్ని మౌత్ ఫ్రెషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన నూనె నోటిలోని బాక్టీరియాను నిరోధించి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి