Ayurveda-Uttareni: ఉత్తరేణి ఔషధాల గని.. బాణ పొట్టను సైతం కరిగించే గుణం దీని సొంతం..

| Edited By: Surya Kala

Jul 16, 2021 | 4:46 PM

Ayurveda-Uttareni: వినాయక చవితికి సమర్పించే పాత్రల్లో ఒకటి ఉత్తరేణి... పూజా క్రమంలో ఈ ఆకుకు ఆరవ స్థానం. ఈ ఉత్తరేణి పూజకు కాదు ఆయుర్వేద వైద్యంలో..

Ayurveda-Uttareni: ఉత్తరేణి ఔషధాల గని.. బాణ పొట్టను సైతం కరిగించే గుణం దీని సొంతం..
Uttareni
Follow us on

Ayurveda-Uttareni: వినాయక చవితికి సమర్పించే పాత్రల్లో ఒకటి ఉత్తరేణి… పూజా క్రమంలో ఈ ఆకుకు ఆరవ స్థానం. ఈ ఉత్తరేణి పూజకు కాదు ఆయుర్వేద వైద్యంలో కూడా విశిష్ట స్థానం ఉంది. ఉత్తరేణిలోని కాండం, ఆకు అని భాగాలూ అనేక వ్యాధులకు నివారణకోసం ఉపయోగపడతాయి. పాము, తేలు వంటి విషజంతువులు కుట్టినపుడు కూడా ప్రాధమిక చికిత్స కోసం ఉత్తరేణి మంచి ఔషధం.. ఉత్తరేణిని సంస్కృతంలో అపామార్గ , ఖరమంజరి అంటారు. తెలుగులో ఉత్తరేణి ,  దుచ్చెన చెట్టు అనికూడా అంటారు. ఈరోజు ఉత్తరేణి చెట్టు ఉపయోగాల గురించి తెలుసుకుందాం..

*ఉత్తరేణి కషాయం,లేదా రసం కిడ్నీలను శుభ్రం చేస్తుంది. మూత్రం ఈజీగా పోయేలా చేస్తుంది.
* ఉత్తరేణి రసం కఫము , శరీర ఉబ్బు , నొప్పులు, గజ్జి , కుష్టును నివారిస్తుంది.
* ఉత్తరేణిని అనుభవ వైద్యులు కాయసిద్ధి ఔషధంగా ఉపయోగిస్తారు. అంటే వయసు పెరగకుండా చేసే మెడిసిన్స్ లో ఉత్తరేణిని ఉపయోగిస్తారు.
* ఉత్తరేణి విత్తనాలను పాలతో వండుకుని తింటే ఆహారం తర్వాత వచ్చే కడుపు నొప్పిని నివారిస్తుంది. దీనిని శూల అని కూడా అంటారు.
*ఉత్తరేణి భస్మం అజీర్ణ సమస్యలకు మంచి ఔషధం. (సమూల భస్మం అనగా ఉత్తరేణి చెట్టు ని వేర్లతో సహా పీకి తీసుకొచ్చి ఎండించి కాల్చి బూడిద చేయడం) ఈ భస్మాన్ని గంజి నీటితో కాని శొంటి కషాయంతో రెండు పూటలా ఆహారం తిన్న తర్వాత తీసికొనవలెను .
* పిచ్చి కుక్క కరిచిన వారికీ ఉత్తరేణి విత్తనాల చూర్ణం దివ్య ఔషధం. దీని విత్తనాల చూర్ణముని నీళ్లతో నూరి ఇచ్చిన వెర్రి కుక్క కరవడం వలన వచ్చే హైడ్రోఫోబియా తగ్గుతుంది.
* తేలు, జెర్రి, పాము వంటి విష జంతువులు కరచినప్పుడు కరిచిన ప్లేస్ లో ఉత్తరేణి ఆకులు కాని, పూత వెన్నులు కాని నూరి కరిచిన చోట దళసరిగా పట్టించిన బాధ , మంట తగ్గుతుంది. విషం హరిస్తుంది.
* ఉబ్బసం తో బాధపడేవారు ఈ చెట్టు యొక్క సమూల భస్మం ఒక గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే తగ్గుతుంది.
* ఉత్తరేణి రసంలో దూది తడిపి పుప్పి పంటిలో పెట్టిన పుప్పిపంటి నొప్పి తగ్గుతుంది.
* వరసగా కొన్ని రోజులు జ్వరంతో బాధపడుతుంటే.. ఉత్తరేణి పచ్చి ఆకు నూరి కొద్దిగా మిరియాలు , కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరి గచ్చకాయలు అంతా మాత్రలుగా చేసుకుని తీసుకోవాలి. తద్వారా చలిజ్వరంనివారింపబడుతుంది.
* కందిరీగ , తెనెటీగ కుట్టినప్పుడు వెంటనే ఈ ఆకుని నీళ్లతో నూరి పలుచగా పూసిన మంట నివారణ అగును.
*అంతేకాదు ఉత్తరేణి ఆకురసం లో ముల్లంగి గింజలు కలిపి నూరి సొరియాసిస్ మచ్చలు పైన రాసిన మచ్చలు తగ్గును.. ఇలా ఒక 40 రోజుల్లో వరసగా చేసిన యెడల సోరియాసిస్ మచ్చలు తగ్గుతాయి.

Also Read: Srilanka Hindu Temples: శ్రీలంక లోని ప్రముఖ హిందు ఆధ్యాత్మక దేవాలయాలు.. పర్యాటక ప్రాంతాలు