అందరికీ ఇష్టమైన పండ్లలో అరటి పండు కూడా ఒకటి. అరటి పండులో ఎన్నో రకాలు, జాతులు ఉంటాయి. ఒక్కో రకం బట్టి.. ప్రయోజనాలు అనేవి ఉంటాయి. అయితే అందరూ ఎక్కువగా తినేవి మాత్రం చక్కెర కేళి, సాధారణ అరటి పండ్లు. ఇవి ఎక్కడైనా చాలా ఈజీగా దొరుకుతాయి. ధర కూడా తక్కవే. కాబట్టి వీటిని తినడాకి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అరటి పండులో.. రెడ్ బనానా ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అయింది. చూడటానికి ఎరుపు రంగులో ఉండే ఈ అరటి పండులో పోషకాలు కూడా చాలా ఎక్కువే. ఎరుపు రంగు అరటి పండును 21 రోజుల పాటు కంటిన్యూగా తీసుకుంటే శరీరంలోచాలా మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరి రెడ్ బనానా వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మ సమస్యలు:
చర్మం ఎర్రబడడం, డ్రై స్కిన్, దద్దుర్లు, సొరియాసిస్ వంటి ఎన్నో చర్మ సమస్యల్ని దూరం చేయడంలో ఈ రెడ్ కలర్ బనానాలు తినొచ్చు. దీనిని పైపూతగా కూడా అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.
కంటి చూపు మెరుగు పడుతుంది:
చాలా మంది కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంత మంది కంటి శుక్లాల సమస్యతో కూడా బాధ పడతారు. ఇలాంటి వారు ఎరుపు రంగులో ఉండే అరటి పండు తినడం వల్ల చాలా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.
సంతాన లేమి సమస్యలకు చెక్:
అనేక మంది సంతాన లేమి సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ఇలాంటి వారు క్రమం తప్పకుండా అరటి పండు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా మారి.. సంతానోత్పత్తి పెరుగుతుంది. అంతే కాకుండా అంగ స్తంభన సమ్య కూడా దూరమవుతుంది.
నరాల సమస్యలు తగ్గుతాయి:
రెడ్ కలర్ బనానాలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థను బల పరుస్తాయి. నరాల సమస్యలు, మూర్ఛ వ్యాధితో బాధ పడే వారు సైతం తరచూ అరటి పండు తింటే ఆ సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు.
కిడ్నీలో రాళ్ల సమస్య ఉండదు:
ఎరుపు రంగు అరటి పండులో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. ఈ పండును రెగ్యులర్ గా తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గించు కోవచ్చు.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.