Pudina Benefits: పుదీనాలో పుట్టెడు పోషకాలు.. ఎలా వాడినా అద్భుతమైన ప్రయోజనాలే!

| Edited By: Ram Naramaneni

Sep 27, 2023 | 7:26 PM

మనం రోజు వారీ ఆహారాల్లో ఉపయోగించుకునే వాటిల్లో పుదీనా ఒకటి. వీటిని ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్, పులావ్, బిర్యానీలు వంటి వాటిల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. ఇది వంటలకు మంచి సువాసన, టేస్ట్ ని ఇస్తుంది. పుదీనా లేకపోతే బిర్యానీ చేయలేం. పుదీనాతోనే అసలు రుచి వస్తుంది బిర్యానీకి. కానీ పుదీనాలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే మాత్రం ఎలాగైనా దీన్ని వాడాలని అనుకుంటారు. అన్ని పోషక విలువలు ఉన్నాయి పుదీనాలో. ఆయుర్వేదంలో కూడా పుదీనాను విరివిగా..

Pudina Benefits: పుదీనాలో పుట్టెడు పోషకాలు.. ఎలా వాడినా అద్భుతమైన ప్రయోజనాలే!
Pudina
Follow us on

మనం రోజు వారీ ఆహారాల్లో ఉపయోగించుకునే వాటిల్లో పుదీనా ఒకటి. వీటిని ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్, పులావ్, బిర్యానీలు వంటి వాటిల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. ఇది వంటలకు మంచి సువాసన, టేస్ట్ ని ఇస్తుంది. పుదీనా లేకపోతే బిర్యానీ చేయలేం. పుదీనాతోనే అసలు రుచి వస్తుంది బిర్యానీకి. కానీ పుదీనాలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే మాత్రం ఎలాగైనా దీన్ని వాడాలని అనుకుంటారు. అన్ని పోషక విలువలు ఉన్నాయి పుదీనాలో. ఆయుర్వేదంలో కూడా పుదీనాను విరివిగా ఉపయోగిస్తూంటారు. పుదీనా ఆయిల్ కు కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. పుదీనాలో ఉండే ఘాటు, మింట్ ఫ్లేవర్ ఇష్టపడని వారుండరు. పుదీనాతో అనారోగ్య సమస్యలనే కాదు.. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పుదీనాను ఎలా ఉపయోగిస్తే.. ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడిని తగ్గించుకోవచ్చు:

పుదీనాతో ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవచ్చు. పుదీనాలో మనసును తేలిక పరిచి, విశాంతిని ఇచ్చే గుణాలు ఉన్నాయి. అంతెందుకు పుదీనా వాసన చూసినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పుదీనాను అరోమా థెరపీలో విశ్రాంతిని కలిగించేందుకు యూజ్ చేస్తూంటారు.

ఇవి కూడా చదవండి

సీజనల్ వ్యాధులను దరి చేరనివ్వదు:

పుదీనాలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. ఇది వాతావరణ మార్పుల ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వదు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటిని కూడా తగ్గిస్తుంది. తరచూ ఒక కప్పు పుదీనా టీ తాగితే.. ఈ సమస్యలకు స్వస్తి పలకవచ్చు.

జీర్ణ క్రియను సాఫీగా చేస్తుంది:

జీర్ణ క్రియను సాఫీగా చేయడంలో పుదీనా బాగా ఉపయోగ పడుతుంది. తరచూ పుదీనా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. మనం తీసుకునే భోజనంలో పుదీనా కలిపి తీసుకుంటే జీర్ణ క్రియ సమస్యలు అనేవి ఉండవు.

నోటి దుర్వాసన ఉండదు:

కొంతమందికి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎన్నో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి ఉంటారు. ఉదయాన్నే రెండు పుదీనా ఆకులను బాగా నమిలితే నోటి దుర్వాసన పోవడమే కాకుండా క్రిములు, బ్యాక్టీరియా ఉన్నా నశిస్తాయి. నోరు ఫ్రెష్ గా ఉంటుంది.

జుట్టు పెరిగేందుకు హెల్ప్:

పుదీనా జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటీన్ జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేయడమే కాకుండా రాలకుండా చూస్తుంది. జుట్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు పుదీనాను యూజ్ చేయవచ్చు.

కంటి చూపు:

పుదీనాలో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలను రాకుండా చేస్తుంది పుదీనా.

కాగా మీ ఆహారంలో పుదీనా చేర్చుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.