Jackfruit Seeds: పనస గింజలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు!

పనస పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పనస పండులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. చాలా మంది పచ్చి పనస కాయను కూరగా వండుకుని తింటారు. అలాగే పండినప్పుడు.. ఆ పసన తొనలను కూడా తింటూంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో.. చల్లదనం కోసం తింటూంటారు. ఇక పనస పొట్టు కూర గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పనస తొనలను తిన్న తర్వాత గింజల్ని పడేస్తూంటారు. కానీ పనస గింజల్లో కూడా అనేక రకాల పోషకాలు..

Jackfruit Seeds: పనస గింజలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు!
Jackfruit Seeds

Edited By:

Updated on: Jan 13, 2024 | 1:20 PM

పనస పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పనస పండులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. చాలా మంది పచ్చి పనస కాయను కూరగా వండుకుని తింటారు. అలాగే పండినప్పుడు.. ఆ పసన తొనలను కూడా తింటూంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో.. చల్లదనం కోసం తింటూంటారు. ఇక పనస పొట్టు కూర గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పనస తొనలను తిన్న తర్వాత గింజల్ని పడేస్తూంటారు. కానీ పనస గింజల్లో కూడా అనేక రకాల పోషకాలు ఉన్నాయి. పనస గింజల్లో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్, ఫోలేట్ వంటి మినరల్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది పనస పండు. పనస గింజలను తినడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక సమస్యల్ని కూడా నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ గింజల వల్ల ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎనర్జిటిక్‌గా ఉంటారు:

పనస గింజల్లో విటమిన్ బి అనేది మెండుగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గింజలు తినడం వల్ల తక్షణమే శరీరంలో ఎనర్జీ లెవల్స్ అనేవి పెరుగుతుంది. అంతే కాకుండా మెదడు పని తీరు, ఆరోగ్యకరమైన కణాలను కూడా మెరుగు పరుస్తుంది.

హిమోగ్లోబిన్ పెరుగుతుంది:

పనస గింజల్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. రక్త హీనత సమస్య ఉన్నారు.. పనస గింజల్ని తినడం వల్ల ఈ ప్రాబ్లమ్ నుంచి బయట పడొచ్చు.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

పనస గింజల్లో అనేక రకాలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల ఇతర వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. ఎన్నో రకాల వైరల్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా మిమ్మల్ని రక్షిస్తుందిజ

ప్రోటీన్ అధికంగా ఉంటుంది:

పనస గింజల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా ఆకలి వేస్తుంటే.. పనస గింజలు బెస్ట్ అని చెబుతున్నారు నిపుణులు. ఇది తక్కువగా తిన్నా.. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అంతే కాకుండా త్వరగా ఆకలి కూడా వేయడు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు వీటిని ఎలాంటి డౌట్స్ లేకుండా తినొచ్చు. పనస గింజల్ని ఉడకబెట్టి లేదా కాల్చుకుని తిన్నా టేస్టీగానే ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.