ఈ ఆకులు ఏం చేస్తాయిలే అనుకునేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం.. పచ్చడి చేస్తే చిత్తడి కావాల్సిందే..

|

May 29, 2024 | 11:08 AM

కొత్తిమీరలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి. కొత్తిమీర ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. కొత్తిమీరను భారతీయ వంటలలో ఉపయోగించడం సర్వసాధారణం.. దాదాపు ప్రతి కూరగాయల రుచిని మెరుగుపరచడానికి.. సువాసనతోపాటు తాజాగా కనిపించేలా చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ ఆకులు ఏం చేస్తాయిలే అనుకునేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం.. పచ్చడి చేస్తే చిత్తడి కావాల్సిందే..
Coriander Leaves
Follow us on

కొత్తిమీరలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి. కొత్తిమీర ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. కొత్తిమీరను భారతీయ వంటలలో ఉపయోగించడం సర్వసాధారణం.. దాదాపు ప్రతి కూరగాయల రుచిని మెరుగుపరచడానికి.. సువాసనతోపాటు తాజాగా కనిపించేలా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మాత్రమే కాదు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, అనేక ఇతర మసాలా దినుసులను జోడించడం ద్వారా రుచికరమైన చట్నీ కూడా తయారు చేయవచ్చు.. అందుకే.. దీని పేరు వింటేనే ప్రజల నోళ్లలో నీళ్లు ఊరుతుంటాయి..

ప్రజలు అన్ని రకాల కూరగాయలతో పాటు నాన్ వెజ్ వంటలలో కూడా పచ్చి కొత్తిమీరను ఉపయోగిస్తారు. ఇలా దాదాపు ప్రతి వంటకానికి ఈ పచ్చి ఆకులే ప్రాణం. దాని రుచి, సువాసన అందరి మూడ్‌ని రిఫ్రెష్ చేస్తుంది. పచ్చి కొత్తిమీర ఆహారం రుచి, తాజాదనాన్ని పెంపొందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పచ్చి కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

  • జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా పచ్చి కొత్తిమీరను మీ ఆహారంలో చేర్చుకోండి.
  • డ్రై స్కిన్, ఎగ్జిమా వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది
  • కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దాని సహాయంతో మీరు వేసవిలో మీ శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేయవచ్చు.
  • రక్తశుద్ధిలో సహాయపడుతుంది
  • కీళ్ల నొప్పులు, వాపుల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది
  • గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది
  • మూత్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది..

మీరు కొత్తిమీరతో అనేక రకాల రుచికరమైన వంటకాలను తయారు చేయవచ్చు.. వాటి గురించి తెలుసుకోండి..

కొత్తిమీర వెల్లుల్లి చట్నీ..

దీనికి పచ్చి కొత్తిమీర తరుగు, తగినంత చింతపండు, కారం, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మీరు ఈ రుచికరమైన చట్నీని పరాటా, రోటీ లేదా శాండ్‌విచ్‌తో కూడా తినవచ్చు.

కొత్తిమీర – పుదీనా చట్నీ..

ఈ చట్నీ చేయడానికి, కొత్తిమీర, పుదీనా ఆకులను పూర్తిగా శుభ్రం చేసి, ఆ తర్వాత చింతపండు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా మీరు ఇంట్లోనే మార్కెట్ లాగా టేస్టీ గ్రీన్ చట్నీని తయారు చేసుకోవచ్చు.

పచ్చి కొత్తిమీర, నిమ్మకాయతో ఫ్రైడ్ రైస్..

సాధారణ ఫ్రైడ్ రైస్‌కు బదులుగా, మీరు పచ్చి కొత్తిమీర, నిమ్మకాయలను ఉపయోగించి స్పైసీ ఫ్రైడ్ రైస్‌ను సిద్ధం చేసుకోవచ్చు. దీని కోసం పాన్‌లో నెయ్యి తీసుకుని, శనగలు, టొమాటోలు, పచ్చికొత్తిమీర, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి తక్కువ సమయంలో టేస్టీ అండ్ స్పైసీ ఫ్రైడ్ రైస్ సిద్ధం చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..