
కొబ్బరితో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొబ్బరి నీరు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వీటిల్లో ఏది తిన్నా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల్ని నేచురల్‌గా తగ్గించుకోవచ్చు. అయితే కొబ్బరి తీసేటప్పుడు.. చిప్పల్ని చాలా మంది పడేస్తూంటారు. కానీ వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు పడేయరు.
కొబ్బరి చెట్టును కల్ప వృక్షంగా కొలుస్తూంటారు పెద్దలు. ఉదయం లేవగానే కొబ్బరి చెట్టును చూస్తే అదృష్టంగా భావిస్తారు. అలాగే పలు పండుగలు, సంప్రదాయాలకు కొబ్బరి ఆకులు, కాయలు అవసరం. కొబ్బరితో కూడా ఎన్నో వంటలు చేస్తారు. అదే విధంగా కొబ్బరి పీచును కూడా ఉపయోగిస్తూంటారు. కానీ కొబ్బరి చిప్పను మాత్రం ఉపయోగించరు. కానీ కొబ్బరి చిప్పతో అనేక అద్బుతమైన ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పుడప్పుడు గాయాలు అవసరం అవుతూ ఉంటాయి. గాయపడిన అవయవాలకు కొబ్బరి చిప్పను దివ్యౌషధంగా ఉపయోగిస్తారు. కొబ్బరి చిప్పలను పొడిగా తయారు చేసుకుని.. దీనికి పసుపు కలిపి గాయాలు ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయాలి. ఇలా చేస్తే గాయం వల్ల వచ్చే వాపు తగ్గుతుంది.
చాలా మందికి పళ్లు అనేవి పసుపు రంగులోకి మారతాయి. కొబ్బరి చిప్పలను పొడిగా చేసుకుని అందులో కొద్దిగా పసుపు, బేకింగ్ సోడా చిటికెడు కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమంతో పళ్లను తోముకుంటే దంతాలు అనేవి పసుపు రంగు పోయి తెల్లగా మెరిసి పోతాయి.
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. దీంతో మార్కెట్లో లభ్యమయ్యమే రకరకాల ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. కానీ కొబ్బరి చిప్పతో తయారు చేసే బొగ్గు.. జుట్టుకు చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఇది జుట్టును పెరిగేందుకు, కొత్త జుట్టు వచ్చేందుకు సహాయ పడుతుంది. కాల్చిన కొబ్బరి చిప్ప పొడిని.. కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించడం వల్ల కుదుళ్లు అనేవి బలంగా మారతాయి. స్కాల్ఫ్ పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. కొబ్బరి జుట్టు బూడిదను హెయిర్ మాస్క్‌గా యూజ్ చేయవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.