Cauliflower: దీని ఆకులు ఫ్లవర్‌ కంటే మేలు.. ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

|

Feb 09, 2023 | 5:04 PM

దీని కారణంగా ఎముకల నొప్పి, మోకాలి నొప్పి, బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్న రోగులకు కాలిఫ్లవర్‌ ఆకుల వినియోగం ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు.. ఇవి అనేక రకాల తీవ్రమైన గుండె జబ్బుల నుండి రక్షించడానికి పని చేస్తాయి.

Cauliflower: దీని ఆకులు ఫ్లవర్‌ కంటే మేలు.. ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Cauliflower Leaves
Follow us on

కాలీఫ్లవర్‌ అనేది శీతాకాలంలో విరివిగా దొరికే సీజనల్ వెజిటేబుల్. దీంతో కాలీఫ్లవర్ పరాటాలు, బజ్జీలు, పచ్చళ్లు కూడా చేస్తుంటారు. అయితే చాలామంది తెల్లటి భాగాన్ని మాత్రమే తినేందుకు ఇష్టపడతారు. అయితే దీని ఆకులు, వేర్లు కూడా అత్యధిక పోషకాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా? మీరు కూడా ఈ కూరగాయను కోసేటప్పుడు దాని ఆకులు, వేర్లు వృధాగా విసిరేస్తున్నట్టయితే.. ఒకసారి ఇది తెలుసుకోండి..కాలీఫ్లవర్‌ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పుష్కలమైన ఐరన్, కాల్షియంతో పాటు ఫ్లవర్‌ కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, ఫాస్పరస్, మూడు రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంటాయి. దీన్ని రెగ్యులర్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

కాలీఫ్లవర్‌ ఆకుల్లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే కాలీఫ్లవర్‌ ఆకులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా చాలా సమృద్దిగా ఉంటుంది. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా శరీరం జీర్ణ శక్తిని అభివృద్ధి చేయడంలో, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. 100 గ్రాముల కాలీఫ్లవర్‌ ఆకుల్లో 600 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. డైరీ ప్రొడక్ట్స్ అంటే అలర్జీ ఉన్నవారు క్యాలీఫ్లవర్ ఆకులను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని కాల్షియం బ్యాలెన్స్ అవుతుంది.

క్యాలీఫ్లవర్ వండుకుని తింటారు. కానీ కోసే ముందు దాని ఆకులు మాత్రం తీసి బయట పడేస్తారు. నిజానికి క్యాలీఫ్లవర్ ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాలీఫ్లవర్‌ ఆకులతో కళ్లకు మేలు చేస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ప్రకారం, కాలీఫ్లవర్ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీని వినియోగం సీరం రెటినోల్ స్థాయిని పెంచుతుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో, అంధత్వంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆకులలో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లతో పాటు అధిక ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. కాబట్టి దీని వినియోగం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీరు దానిని వివిధ మార్గాల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఒక పరిశోధన ప్రకారం, కాలీఫ్లవర్ ఆకులు ప్రోటీన్, ఖనిజాలకు మంచి మూలం. ఇవి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి అవసరమైనవి. పుల్లటి ఆకులను రోజూ తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వారి ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది.
న్యూట్రిషన్, డైటెటిక్స్ విభాగం ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. కాలీఫ్లవర్ ఆకులు ఐరన్‌ యొక్క గొప్ప మూలం. అటువంటి సందర్భాలలో దాని వినియోగం రక్త లోపాన్ని తొలగించడానికి ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. 100 గ్రాముల దీని ఆకులు 40 mg ఇనుమును అందిస్తాయి. అనేక శాస్త్రీయ అధ్యయనాలలో రక్తహీనత చికిత్సలో కాలీఫ్లవర్‌ ఆకులు కూడా ప్రభావవంతంగా పరిగణించబడతాయి.

ఈ ఆకులు యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండివుంటాయి. ఇవి అనేక రకాల తీవ్రమైన గుండె జబ్బుల నుండి రక్షించడానికి పని చేస్తాయి. అలాగే, ఇందులో తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, ఇది కార్డియాక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆకు కాల్షియం యొక్క ఉత్తమ మూలం. దీని కారణంగా ఎముకల నొప్పి, మోకాలి నొప్పి, బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్న రోగులకు కాలిఫ్లవర్‌ ఆకుల వినియోగం ఎంతో మేలు చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..