AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : శ్రీమంతం వేడుకలో భర్తతో కలిసి గర్భిణి అదిరిపోయే డాన్స్.. ఫిదా అవుతున్న నెటిజన్స్..

దాంతో అక్కడున్నవారంతా కేరింతలు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు గర్భిణి డ్యాన్స్‌కు ఫిదా అవుతూ.. కామెంట్లు పెడుతున్నారు.

Watch : శ్రీమంతం వేడుకలో భర్తతో కలిసి గర్భిణి అదిరిపోయే డాన్స్.. ఫిదా అవుతున్న నెటిజన్స్..
Couple Viral Dance
Jyothi Gadda
|

Updated on: Feb 09, 2023 | 4:16 PM

Share

మన దేశంలో ప్రతి పండగ ఒక వేడుకే.. ఇంట్లో జరిగే ప్రతి వేడుక ఒక పండగే.. శుభకార్యం ఏదైనా సరే.. ఆటపాటలు లేనిదే ఆ కార్యం పరిపూర్ణం కాదు..ఇష్టమైన పాటలు పెట్టుకుని నచ్చినట్టుగా డ్యాన్స్‌ చేయటం, సరదా సరదాగా సందడి చేయటం మామూలే. ఇలా పండుగలు, వివాహాలు, పుట్టినరోజులు అన్ని సందర్భాల్లో ఇలాంటి సరదాలు ఉండాల్సిందే..కానీ, (బేబీ షవర్స్) గర్భిణీకి చేసే సీమంతం కార్యక్రమం కూడా ఇప్పుడు ట్రెండ్‌ సెట్‌చేసేలా నిర్వహించారు ఇక్కడ ఓ కుటుంబీకులు. కాబోయే ఆ తల్లిదండ్రులు తమ బేబీ షవర్‌లో డ్యాన్స్ చేసిన జంట అందరినీ అలరించింది.. ఈ సంతోషకరమైన సందర్భంలో ఈ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఎలా డ్యాన్స్ చేశారనే దానిపై సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అందమైన జంట మరింత అందంగా స్టెప్పులు వేస్తున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తుంది. కాబోయే తల్లి సొగసైన చీరలో నవ్వుతూ, ఊగుతూ కనిపిస్తుండగా, కాబోయే నాన్న ఆమెతో పాటుగా అడుగులు వేస్తూ, అప్పుడప్పుడూ తన అందగత్తెని చూస్తున్నాడు..

అయితే, సాధారణంగా గర్భిణిలు మునుపటిలా చలాకీగా తిరిగేందుకు కాస్త ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఓ గర్భిణి మాత్రం తన బేబీ షవర్‌ వేడుకలో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేసి అందరి మనసుల్ని దోచుకుంది. సీమంతం వేడుకలో తన భర్తతో కలిసి ఎంతో యాక్టివ్‌గా డ్యాన్స్‌ చేసింది. కింగ్‌ సినిమాలోని ‘మాన్‌ మేరీ జాన్‌’ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేసింది. దాంతో అక్కడున్నవారంతా కేరింతలు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు గర్భిణి డ్యాన్స్‌కు ఫిదా అవుతూ.. కామెంట్లు పెడుతున్నారు.

డింపుల్‌బ్రహ్మభట్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీరి డ్యాన్స్ వీడియోకి ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్‌, పదివేల లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అంతే అందంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?