Castor Oil Benefits: ఆముదం గురించి ఈ నిజాలు తెలిస్తే.. ఖచ్చితంగా ఉపయోగిస్తారు!

ఇప్పుడంటే ఆముదం వాడకం తగ్గిపోయింది కానీ.. పూర్వం అయితే ఆముదాన్ని ఎక్కువగా ఉపయోగించే వారు. ఆయుర్వేదంలో అనేక రకాలైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆముదాన్ని సంస్కృతంలో పంచాగుల, ఏరండ అని కూడా పిలుస్తారు. ఆముదం మొక్కల్లో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలని తగ్గించుకోవడంతో పాటు.. ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఆముదాల్లో చాలా రకాలు ఉంటాయి. ఎర్ర ఆముదం, తెల్ల ఆముదం..

Castor Oil Benefits: ఆముదం గురించి ఈ నిజాలు తెలిస్తే.. ఖచ్చితంగా ఉపయోగిస్తారు!
Castor Oil

Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2024 | 2:40 PM

ఇప్పుడంటే ఆముదం వాడకం తగ్గిపోయింది కానీ.. పూర్వం అయితే ఆముదాన్ని ఎక్కువగా ఉపయోగించే వారు. ఆయుర్వేదంలో అనేక రకాలైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆముదాన్ని సంస్కృతంలో పంచాగుల, ఏరండ అని కూడా పిలుస్తారు. ఆముదం మొక్కల్లో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలని తగ్గించుకోవడంతో పాటు.. ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఆముదాల్లో చాలా రకాలు ఉంటాయి. ఎర్ర ఆముదం, తెల్ల ఆముదం, పెద్ద ఆముదం, చిట్టి ఆముదం అని ఉంటాయి. ఆముదంతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

నులి పురుగుల నివారణ:

కడుపులో నులి పురుగులను వదించుకోవడంలో ఆముదం ఆకులు చాలా ఉపయోగ పడతాయి. ఆముదం ఆకులు తీసుకుని కడుపై బాగా రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు మలం ద్వారా బయటకు పోతాయి. చిన్న పిల్లలకు ఇది బాగా పని చేస్తుంది.

మూల వ్యాధి:

ఆముదం ఆకులు, కర్పూరాన్ని కలిపి మెత్తగా నూరాలి. ఇలా కలిపి నూరిన మిశ్రమాన్ని కట్టు కట్టుకోవడం వల్ల మూల వ్యాధి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

నెలసరి సమస్యలు:

స్త్రీలు నెలసరి సమయంలో పలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొంత మందికి నెలసరి సరైన సమయానికి రాదు. ఇలాంటి వారు ఆముదం ఆకులను కచ్చా పచ్చాగా దంచి.. వేడి చేసి పొత్తి కడుపుపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల నెలసరి వెంటనే వస్తుంది.

జుట్టు పొడుగ్గా పెరుగుతుంది:

ఇటీవల కాలంలో చాలా మంది పలు రకాల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చుండ్రు, జుట్టు రాలడం, పల్చగా అవ్వడం. ఆముదం నూనెను వాడటం వల్ల జుట్టు నల్లగా, పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది.

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:

ఆముదం ఆయిల్‌లో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆముదం నూనెను వాడటం వల్ల చర్మ సమస్యలు తగ్గి.. ఆరోగ్యంగా ఉంటుంది. ఆముదం నూనె మాయిశ్చర్‌లా పని చేస్తుంది.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి:

చాలా మంది కీళ్ల, మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ ఉంటున్నారు. ఈ నొప్పులు త్వరగా తగ్గాలంటే.. ఆముదం ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. ఆ తర్వాత ఈ ఆకులను నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల, మోకాళ్ల నొప్పులు, పక్షవాతం, మల బద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.