Amla and Honey: గ్యాస్, అసిడిటీ బాధితులకు ఈ మిశ్రమం సహజమైన ఔషధం.. రోజూ పరగడుపున తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

|

Nov 24, 2021 | 6:40 PM

Amla and Honey: ఈ సీజన్ లో దొరికే ఉసిరికాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. అయితే ఈ ఉసిరిని.. తేనె తో కలిపి తీసుకుంటే.. ఈ రెండు కలిసి మరింతగా శరీరానికి..

Amla and Honey: గ్యాస్, అసిడిటీ బాధితులకు ఈ మిశ్రమం సహజమైన ఔషధం.. రోజూ పరగడుపున తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Amla And Honey
Follow us on

Amla and Honey: ఈ సీజన్ లో దొరికే ఉసిరికాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. అయితే ఈ ఉసిరిని.. తేనె తో కలిపి తీసుకుంటే.. ఈ రెండు కలిసి మరింతగా శరీరానికి పోషకాలను అందిస్తాయని.. ఎన్నో అనారోగ్యాలను తేనెలో నానబెట్టిన ఉసిరిని తింటే నివారించుకోవచ్చునని పెద్దలు మనకు ఎప్పుడో చెప్పారు. ఈరోజు తేనెను , ఉసిరికాయ జామ్.. తయారీ.. అది రోజూ పరగడుపున తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

తేనె ఉసిరి జామ్ తయారీ: 

ముందుగా రాతి ఉసిరికాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. తర్వాత ఒక గాజు సీసా తీసుకుని అందులో సగం నిండేవరకూ తేనేతో నింపాలి. ఇప్పుడు కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలను తీసుకుని చిన్న చిన్న గాటు పెట్టి.. ఆ తేనెలో వేయాలి. తడి తగలకుండా గాజు సీసా మూత పెట్టి.. ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొన్ని రోజులు కదపకుండా ఉంచేస్తే.. ఉసిరికాయతేనె జామ్ తయారవుతుంది.  రోజు పరగడుపున తేనెతో కలిసి ఒక ఉసిరికాయను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు: 

1.ఇలా తేనె ,ఉసిరికాయ తినడం వలన కాలేయంలో వ్యర్ధాలు బయటకు వెళ్లి.. లివర్ పనితీరు మరింత మెరుగుపడుతుంది. కాలేయం సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా కామెర్ల వ్యాధిబారిన పడివారికి మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
2. ఈ జామ్ మహిళలోని రుతు సమస్యలను తీరుస్తుంది. రుతుక్రమం రెగ్యులర్ అవుతుంది.
3. ఈ ఉసిరి, తేనే మిశ్రమం మగవారిలో లైంగిక శక్తిని పెంపొందిస్తుంది, వీర్య నాణ్యత పెరిగి.. సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి.
4. ఈ మిశ్రమం రెగ్యులర్ గా తీసుకుంటే.. చర్మం మీద ముడతలు నివారిస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు, ముడతలు తగ్గుతాయి.
5. ఈ సీజనల్ లో ఆస్తమాతో ఇబ్బంది పడేవారు శ్వాసను సరిగా తీసుకోలేరు. అటువంటివారికి ఈ మిశ్రమం మంచి మెడిసిన్. తేనె, ఉసిరి మిశ్రమం రోజూ తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి.
6. చలికాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది. దీంతో తిన్నది ఏదైనా జీర్ణం సరిగా కాదు. అయితే ఈ తేనె, ఉసిరి జామ్ తినడంవలన జీర్ణ శక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం జీర్ణమవుతుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ సమస్యలతో ఇబ్బందిపడేవారికి ఈ మిశ్రమం మంచి ఔషధంగా పనిచేస్తుంది.
7. ఆకలి లేనివారికి ఆకలి పెరిగేలా చేస్తుంది.
8. మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది.
9 ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. గుండె జబ్బులను నివారిస్తుంది.
10  తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే జుట్టు సమస్యలు దూరమవుతాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.
11. అధిక బరువు ఉన్నవారికీ ఈ మిశ్రమం తీసుకుంటే బరువు తగ్గేలా చేస్తుంది. శరీరంలోని కొవ్వు కరిగేలా  చేయడంతో బరువు తగ్గుతారు.
12. తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు  ఉండడంతో.. ఈ మిశ్రమం వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా ప‌నిచేస్తుంది. దీంతో చలికాలంలో మనకు ఎదుర‌య్యే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి స‌మ‌స్యలను సహజంగా నివారిస్తుంది.

Also Read:  మృతులకు చంద్రబాబు రూ.లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటన.. అధికారంలోకి రాగానే రూ. 25 లక్షలు ఇస్తాంః చంద్రబాబు