ప్రస్తుతం ఇప్పుడు అందర్నీ వేధించే సమస్య డయాబెటీస్. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే మధుమేహం సమస్యతో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకుని.. ఎంత కంట్రోల్ లో ఉన్నా కూడా రోజు రోజుకూ ఈ వ్యాధి తీవ్రతరం అవుతూనే ఉంటుంది. దీంతో నచ్చిన ఆహారం తినలేక.. నోరు కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే డయాబెటీస్ ను కంట్రోల్ లోకి తీసుకొచ్చే ఎన్నో రకాల ఫుడ్స్ గురించి, డ్రింక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మొత్తానికి డయాబెటీస్ ను తరిమేసే మంచి దివ్యౌషధం గురించి తెలుసుకోబోతున్నాం.
స్టీవియా ఆకులు.. చాలా మందికి వీటి గురించి తెలీవు. ఈ ఆకులు తియ్యగా ఉంటాయి. ఈ ఆకుల పొడి మనకు ఎక్కడైనా లభిస్తుంది. మధుమేహం ఉన్న వారు చక్కెరకు బదులుగా దీన్ని వాడుకోవచ్చు. అలాగే డయాబెటీస్ ను కొద్ది రోజుల్లోనే కంట్రోల్ లోకి తీసుకొస్తుంది. క్రమం తప్పకుండా ఈ ఆకుల పొడిని వాడితే.. షుగర్ ను పూర్తిగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డయా బెటీస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తీపి తినలేమని బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పొడిని ఉపయోగించి స్వీట్లు కూడా తయారు చేసుకోవచ్చు.
పంచదార, బెల్లం వంటి వాటికి బదులు ఈ స్టీవియా ఆకుల పొడిని వాడుకోవచ్చు. టీ, కాఫీ, జ్యూస్ లు, టిఫిన్స్ లోకి, లస్సీ, వేడి వేడి పదార్థాల్లోకి ఇలా ఈ ఆకుల పొడిని తీసుకోవచ్చు. స్టీవియా ఆకుల్లో క్యాలరీలు, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ వంటి పోషకాలు ఉండవు. కాబట్టి ఈ ఆకులను హ్యాపీగా జీర్ణం అవుతుంది. ఇంకా ఈ పొడితో మరి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేసేయండి.
– ఈ పొడిని వాడటం వల్ల షుగర్ మాత్రమే కాకుండా.. ఆస్థమా, శ్లేష్మాలు, దగ్గు, పిల్లికూతలు వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
– గుండె ఆరోగ్యంగా ఉంటుంది
– బ్లడ్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ల బారిన పడకుండా ఉండొచ్చు.
– రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి