AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడుతున్నారా.. ఇవి తిని చూడండి.. పరిష్కారం లభించొచ్చు..

పిస్తా అనేది డ్రై ఫ్రూట్. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ..

జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడుతున్నారా.. ఇవి తిని చూడండి.. పరిష్కారం లభించొచ్చు..
Pistachio
Amarnadh Daneti
|

Updated on: Jan 09, 2023 | 9:15 AM

Share

పిస్తా అనేది డ్రై ఫ్రూట్. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరం అనేక ప్రయోజనాలను పొందుతుంది. మీకు ఆకలిగా అనిపిస్తే, మీరు సాయంత్రం అల్పాహారంగా పిస్తాపప్పులను తినవచ్చు. పిస్తా పప్పు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో మతిమరుపు చాలా సాధారణం అయిపోయింది. పిస్తా పప్పుతో కొంతవరకు దీనిని అదుపులో ఉంచవచ్చు. ఇందులో చాలా ఖనిజాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మరింత చురుకుగా చేస్తాయి. పిస్తా తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. పిస్తా తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ కొన్ని పిస్తాపప్పులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండెను అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. అందుకే ఇది గుండెకు అనుకూలమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు.

పిస్తా తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. క్యాన్సర్ నిరోధకంలో సహాయకారిగా పరిగణించే పిస్తాపప్పులో యాంటీ కార్సినోజెనిక్ మూలకాలు కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్‌ని నివారించేందుకు తోడ్పడుతాయి.  బలమైన ఎముకలకు విటమిన్ డి, కాల్షియం అవసరం. ఈ రెండు పిస్తాపప్పులో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో దీని రోజువారీ వినియోగం ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. వీటి ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తాం కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కంటికి మేలు చేసే A, E విటమిన్లు పిస్తాపప్పులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్