భారతీయ ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చికిత్సలు ఉన్నాయి. ఈ చికిత్సలకు ఉపయోగించే మొక్కలు. .. ఆకులు..చెట్లు మన ఇంటి పరిసరాల్లోనే ఉంటాయి. అందులో ఒకటి అడుసుచెట్టు. ఈ చెట్టు ఆకులు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా చలికాలంలో అడుసు ఆకుల వలన అనేక ప్రయోజనాలున్నాయి. దీనిని అడ్డస్, అరుస్, బచ్చుస్, బిర్సోటా, రుసా, అరుసా అనే పేర్లతో పిలుస్తారు. ఇంగ్లీష్ లో మలబార్ నట్ అంటారు. జలుబు, దగ్గు, గుండె జబ్బులు, రక్త సంబంధిత వ్యాధులు, శ్యాసకోశ వ్యాధులు, జ్వరం, కుష్ణు వంటి వ్యాధులకు అడుసు ఆకుతో చికిత్స చేయవచ్చు. ఈ చలికాలంలో చాలా మంది శ్వాస కోశ వ్యాధులతో ఇబ్బందిపడుతుంటారు. ఈ సమస్యలు ఉన్నవారు అడుసు ఆకుల రసం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీలో భారంగా అనిపించడం. రద్దీగా అనిపించడం వంటివి తగ్గిస్తుంది. శ్వాసనాళంలో మంటను తగ్గిస్తుంది. ఇక చలికాలంలో అడుసు ఆకుల వలన అనేక ప్రయోజనాలున్నాయి.
అడుస ఆకులలో వెసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది శ్వాసకోశాన్ని విస్తరిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శ్వాసకోశంలో మంటను తగ్గించడమే కాకుండా.. గొంతు ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో అడుస ఆకులు ఉపయోగపడతాయి. అలాగే చలికాలంలో వచ్చే జలుబును తగ్గిస్తుంది. ఈ ఆకులను నీటిలో మరిగించి కషాయంగా చేసి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు.. జలుబు తగ్గుతుంది. ఈ ఆకులు రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది యాంటీ ఫైబ్రినోలైటిక్ లక్షణాలను కలిగి ఉంది. మోకాలి నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే కాళ్ల వాపులు.. మోకాలి నొప్పులను తగ్గించడంలో అడుసు ఆకులు ఉపయోగపడతాయి. అంతేకాకుండా.. అడుస పువ్వు తలనొప్పిని తగ్గిస్తుంది. అడుస పువ్వును బెల్లంతో కలిపి తీసుకుంటారు. దీంతో తలనొప్పి తగ్గుతుందట.
Also Read: Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..
Puneeth Rajkumar: కన్నడ కన్నీటి నీరాజనం.. పునీత్‌రాజ్‌కు కర్నాటక సర్కార్ సత్కారం..