Adenovirus Symptoms: చిన్న పిల్లలను వణికిస్తున్న కొత్త వైరస్.. దీని లక్షణాలేంటో తెలుసా?
పశ్చిమ బెంగాల్లో ఓ కొత్త వైరస్ విజృంభణ కలకలం రేపుతుంది. ముఖ్యంగా చిన్నారులే ఈ వైరస్ బారిన పడుతున్నారనే వార్తల నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. అడెనో వైరస్‌గా పిలుస్తున్న ఈ వైరస్ వల్ల సాధారణంగా జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్‌ఫెక్షన్‌లే వస్తాయి. అయిలే ప్రస్తుతం ఇది చిన్నారులకు సోకిన తర్వాత కొంత మంది మరణించడంతో అందరూ భయపడుతున్నారు.
కరోనా తర్వాత ఏ చిన్న రుగ్మత వచ్చినా ప్రతి ఒక్కరూ కంగారుపడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చలికాలం నుంచి వేసవి కాలం వస్తుంది. ఈ నేపథ్యంలో సీజనల్ జర్వాలు లేదా ఇన్‌ఫెక్షన్లు సర్వ సాధారణం. అయితే ఇలాంటి పరిస్థితులో పశ్చిమ బెంగాల్లో ఓ కొత్త వైరస్ విజృంభణ కలకలం రేపుతుంది. ముఖ్యంగా చిన్నారులే ఈ వైరస్ బారిన పడుతున్నారనే వార్తల నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. అడెనో వైరస్‌గా పిలుస్తున్న ఈ వైరస్ వల్ల సాధారణంగా జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్‌ఫెక్షన్‌లే వస్తాయి. అయిలే ప్రస్తుతం ఇది చిన్నారులకు సోకిన తర్వాత కొంత మంది మరణించడంతో అందరూ భయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ వైరస్ సోకి ఇటీవల ఓ ఆరు నెలల చిన్నారితో పాటు రెండేళ్ల పాప కూడా మరణించడంతో అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ల్లో ఈ తరహా కేసులు విపరీతంగా పెరగడంతో ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ఉందని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అడెనో వైరస్ వ్యాప్తి, లక్షణాలు
అడెనోవైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు తాకడం లేదా కరచాలనం చేయడం, మలంతో పరిచయం వంటి దగ్గరి వ్యక్తిగత పరిచయం ద్వారా వ్యాపిస్తాయి. ఉదాహరణకు, డైపర్‌లను మార్చేటప్పుడు, దగ్గడం లేదా తుమ్మడం ద్వారా గాలి ద్వారా లేదా అడెనోవైరస్‌లు ఉన్న వస్తువును తాకడం ద్వారా, ఆపై చేతులు కడుక్కోవడానికి ముందు నోరు, ముక్కు లేదా కళ్లను తాకడం వంటివి చేస్తే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకితే శ్వాస కోశ ఇబ్బందులతో పాటు పేగు సంబంధిత సమస్యలు కూడా వేధిస్తాయని నిపుణులు చెబతున్నారు. అలాగే వైరస్ సోకిన దాదాపు 14 రోజుల తర్వాతే లక్షణాలు బయటకు తెలుస్తాయి. దీంతో వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే సాధారణ జలుబు వంటి లక్షణాలు, గొంతు నొప్పి, ముక్కు కారడం, జ్వరం, శోషరస గ్రంధులు వాపు, తీవ్రమైన దగ్గు, కండ్లకలక, తీవ్రమైన బ్రోన్కైటిస్ లేదా శ్వాసనాళాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పేగు ఇన్‌ఫెక్షన్‌ల వల్ల వచ్చే లక్షణాలు ఆకస్మికంగా నీటి విరేచనాలు, పొత్తికడుపు సున్నితత్వం, వాంతులు, జ్వరం, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటివి సంభవించవచ్చు.
అడెనో వైరస్ చికిత్స
అడెనోవైరస్ ఇన్ఫెక్షన్లకు చికిత్స లేదు. పిల్లలు అడెనోవైరస్ సంక్రమించినప్పుడు, వారి చికిత్స సంక్రమణకు సంబంధించిన లక్షణాల నుంచి ఉపశమనం పొందడంపై దృష్టి పెట్టాలి. యాంటీబయోటిక్స్ చికిత్సకు ప్రభావవంతంగా ఉండవు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల వస్తుంది. పిల్లల వయస్సు, ఆరోగ్యం, వైద్య చరిత్ర, నిర్దిష్ట మందులు, విధానాలు లేదా చికిత్సలపై సహనం వంటి వాటి బట్టి వైద్యులు చికిత్స చేస్తారు. అడెనోవైరస్ సోకిన వారికి ఆమోదించబడిన యాంటీవైరల్ మందులు లేవు. రోగి తీవ్ర అనారోగ్యానికి గురైతే, వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చి, ఫ్లూ, పేగు ఇన్‌ఫెక్షన్లు పెరగకుండా తగిన వైద్య సాయం అందించడమే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా అడెనో వైరస్ బారిన పడకుండా ఉండడానికి వ్యక్తిగత పరిశుభ్రత ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్యం, శుభ్రత పాటిస్తూ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..