Joint Pains: ఈ 4 ఆహారాలతో కీళ్ల నొప్పులకు చెక్.. అదనంగా ఆరోగ్య ప్రయోజనాలు..

Joint Pain Remedies: వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పోషకాహార, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు బాదం, వేరుశనగ, వాల్నట్స్ వంటి డ్రైనట్స్‌తో పాటు వివిధ రకాల ఆహారాలను కూడా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు అమ్లాలు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కీళ్ల నొప్పులను..

Joint Pains: ఈ 4 ఆహారాలతో కీళ్ల నొప్పులకు చెక్.. అదనంగా ఆరోగ్య ప్రయోజనాలు..
Joint Pains

Updated on: Jul 29, 2023 | 9:01 PM

Joint Pain Remedies: ఎక్కువ సమయం కూర్చొనే పనిచేయడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి పలు కారణాలతో నేటి కాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలు కలుగుతాయి. ఇంకా శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం కూడా ఈ కీళ్ల నొప్పులకు కారణమే. అయితే వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పోషకాహార, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు బాదం, వేరుశనగ, వాల్నట్స్ వంటి డ్రైనట్స్‌తో పాటు వివిధ రకాల ఆహారాలను కూడా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు అమ్లాలు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కీళ్ల నొప్పులను, శరీరంలో కలిగే ఏ నొప్పినైనా తగ్గించగలవు. ఈ క్రమంలో ఏయే ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

బెర్రీలు: విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లను కలిగిన బెర్రీలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా ఇవి కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. అందుకోసం మీరు ప్రతి రోజూ బర్రీలను తింటే చాలు.

కాలీఫ్లవర్: సల్ఫోరాఫేన్ సమ్మేళనాన్ని కలిగిన ఏ ఆహారాలైనా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ క్రమంలో మీరు కాలీఫ్లవర్, బ్రోకలీ వంటివాటిని తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆలీవ్‌ ఆయిల్‌: ఆలీవ్ ఆయిల్ కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించగలదు. దీనిలోని పోషకాలు మీ శరీరాన్ని దృఢంగా చేయగలవు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించగలవు. ఇంకా ఇది మధుమేహం, ఊభకాయం వంటి సమస్యలను కూడా నిరోధించగలదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..