ప్రస్తుత కాలంలో అనేక మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి వారు పాటిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణమని చెప్పుకోవాలి. అయితే ఈ కారణాలకు మించిన మరో విషయం ఏమిటంటే తినే ఆహారంలో పోషకాలు సరిపడా లేకపోవడమే. అందుకోసం పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే ఆరోగ్య సమస్యలు దూరం కావడమే కాక లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని వారు వివరిస్తున్నారు. వారు చెప్పిన పోషకాలు ఉండే పదార్థాలలో బాదం పప్పులు కూడా ముఖ్యమైనవి. నిజానికి బాదం పప్పు పోషకాల గని. దీనిని బాదం వెన్న, బాదం పాలు, బాదం నూనె తయారీలో కూడా ఉపయోగిస్తారు.
బాదం పప్పును పచ్చిగా తినడంతో పాటు వివిధ రకాల వంటకాల్లో కూడా వాడతారు. ఇందులో ఎన్నో రకాల ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు మరియు ఫైబర్లు సమృద్ధిగా లభిస్తాయి. సాధారణంగా దీనిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఈ బాదంను మనదేశంలో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా బాదంలో పుష్కలంగా ఉంటాయి. మరి ఈ బాదం పప్పులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..