Headache: తరచూ తలనొప్పి వేధిస్తోందా.? ఈ విటమిన్ లోపం అయ్యుండొచ్చు
అయితే కొందరిలో మాత్రం తలనొప్పి తీవ్ర సమస్యగా మారుతుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, మళ్లీ కాసేపటికే మొదలవుతుంది. వాతావరణంలో ఏ మాత్రం మార్పు జరిగినా వెంటనే తలనొప్పి వస్తుంది. అయితే తలనొప్పి సాధారణమే అయినప్పటికీ నిత్యం వేధిస్తుంటే మాత్రం ఏమాత్రం లైట్ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో విటమిన్ లోపం వల్ల కూడా తలనొప్పి సమస్య వేధించే...

తలనొప్పి సర్వసాధారణమైన సమస్య. మనలో ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటాం. కాస్త ఎక్కువ ఆలోచించినా, సరిపడ నీరు తాగకపోయినా, రాత్రి సరిగ్గా నిద్రలేకపోయినా.. ఇలా జీవన విధానంలో ఏమాత్రం మార్పు జరిగినా వెంటనే తలనొప్పి సమస్య వేధిస్తుంది. దీంతో చాలా మంది వెంటనే ఓ ట్యాబ్లెట్ వేసుకోవడమో లేదా టీ తాగడమో చేస్తుంటారు. దీంతో తలనొప్పి పరార్ అవుతుంది.
అయితే కొందరిలో మాత్రం తలనొప్పి తీవ్ర సమస్యగా మారుతుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, మళ్లీ కాసేపటికే మొదలవుతుంది. వాతావరణంలో ఏ మాత్రం మార్పు జరిగినా వెంటనే తలనొప్పి వస్తుంది. అయితే తలనొప్పి సాధారణమే అయినప్పటికీ నిత్యం వేధిస్తుంటే మాత్రం ఏమాత్రం లైట్ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో విటమిన్ లోపం వల్ల కూడా తలనొప్పి సమస్య వేధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఏ విటమిన్ లోపం వల్ల తలనొప్పి సమస్య వస్తుంది.? దీనికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
శరీరంలో విటమిన్ డీ లోపం వల్ల తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి సరిపడ విటమిన్ డి లభించకపోతే శరీరంలో వాపుతో పాటు న్యూరాన్‌ల సమస్య వస్తుంది. ఈ విటమిన్ లోపంతో మైగ్రేన్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. విటమిన్ డీ లోపం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ పెంచం ద్వారా నరాల ప్రేరణలకు పెంచుతుంది ఇది తలనొప్పికి కారణంగా మారుతుంది. అంతేకాకుండా విటమిన్ డీ లోపం వల్ల మెగ్నీషియం స్థాయి తగ్గుతుంది, మెలటోనిన్ స్థాయి పెరుగుతంది. ఇది కూడా తలనొప్పికి కారణంగా మారుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
విటమిన్ డీ లోపంతో బాధపడే వారు డైట్‌లో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో కచ్చితంగా చీజ్, గుడ్లు, సాల్మన్, ట్యూనా, మాకేరెల్ ఫిష్, పాలతో పాటు సోయా గింజలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక విటమిన్ డీ అధికంగా ఆహార పదార్థాల్లో నారింజ రసం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా నారింజను తీసుకుంటే విటమిన్ డీ లోపాన్ని జయించవచ్చు. అలాగే పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డీ పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఇవి ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ డీ లోపాన్ని జయించవచ్చని చెబుతున్నారు.
ఇక కేవలం తీసుకునే ఆహారం ద్వారానే కాకుండా జీవన విధానంలో మార్పుల ద్వారా కూడా విటమిన్ డీ లోపాన్ని జయించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట సూర్యరక్ష్మి తగిలేలా చూసుకోవాలి. అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగిన ఈ రోజుల్లో సూర్య రక్ష్మి లభించడమే భాగ్యంగా మారింది. కాబట్టి ఉదయం లేలేత కిరణాలు పడే సమయంలో వాకింగ్ చేయడాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
