Health: ఉదయాన్నే ఒక్క గ్లాస్ ఈ వాటర్ తాగితే.. ఆల్ సెట్ అంతే…

. ఉదయాన్నే జీలకర్ర నీటిని తీసుకుంటే అది మన శరీరంలోని జీర్ణక్రియను సక్రమంగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ఇది మంచి ఆరోగ్య ఔషధమని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

Health: ఉదయాన్నే ఒక్క గ్లాస్ ఈ వాటర్ తాగితే.. ఆల్ సెట్ అంతే...
Jeera Water

Updated on: Mar 23, 2024 | 6:26 PM

ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగే పానీయాలు మన ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మార్నింగ్ జీలకర్ర నీరు అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం, బరువు తగ్గడం, జుట్టు పెరుగుదల మొదలైన అనేక విషయాలలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు అజీర్ణం, మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ ఎడిసిటీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

  • జీలకర్ర నీరు కడుపును శుద్ది చేస్తుంది.  ఇది శరీర వ్యవస్థ నుండి వ్యర్థాలను బయటకు పంపుతుంది.  కాలేయ పనితీరును బలపరుస్తుంది. ఇమ్యూనిటీ పవర్ బలోపేతం చేయడానికి జీలకర్ర నీరు దోహదం చేస్తుంది
  • ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అజీర్ణం వంటి సమస్యలతో పోరాడుతున్న వ్యక్తులకు రిలీఫ్ ఉంటుంది.
  • జీలకర్రలో  యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల ఉండటం వల్ల మహిళల్లో.. ఋతుక్రమ అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా ఉదయం తాగడం వల్ల మహిళలకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. వారి పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, అధిక రక్తస్రావం వంటి వాటిని నివారిస్తుంది.
  • జీలకర్ర జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు పారదోలుతుంది. మొటిమలను తగ్గిస్తుంది. చర్మానికి చూడచక్కని ఛాయ ఇస్తుంది.
  • జీలకర్ర గింజలు జీవక్రియ సాఫీగా జరిగేందుకు సూపర్ మెడిసిన్. ఇక ఆకలిని తగ్గిస్తాయి.  బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. గ్యాస్, ఉబ్బరం తగ్గింపు వంటి వాటికి కూడా జీలకర్ర వాటర్ ఉపయోగపడతాయి.
  • జీలకర్రలోని కార్మినేటివ్ గుణాల వల్ల అజీర్ణం, ఉబ్బరం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. ఉదయాన్నే దీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యాన్ని తగ్గుతుంది.
  • యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న జీలకర్ర నీరు ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా బలీయమైన కవచంగా పనిచేస్తుంది. వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడేందుకు సాయపడుతుంది
  • జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు ఈ పానియాన్ని డైలీ తీసుకోండి. ఎందుకంటే దీని రెగ్యులర్ వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • షుగర్ ఉన్నవారికి జీలకర్ర నీరు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుందని, ఉదయాన్నే జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల ఇది ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని, రక్తంలో చక్కెరను తగ్గిస్తుందని నిపుణులు చెప్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.)