AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: మీ చిట్టి గుండె పదిలంగానే ఉందా.. ఈ 3 టెస్టులతో ఈజీగా తెలుసుకోండి..

నిన్నటి వరకు మనతో ఎంతో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తి.. ఈ రోజు హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారనే వార్త విన్నప్పుడు ఒక్కసారిగా గుండె గుభేల్ మంటుంది. అంత ఫిట్‌గా ఉన్న వ్యక్తికి గుండెపోటు ఎలా వచ్చింది? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. మరి, మన గుండె లోపల ఏం జరుగుతోంది? అది పదిలంగా ఉందో లేదో కేవలం 3 టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు.

Heart Health: మీ చిట్టి గుండె పదిలంగానే ఉందా.. ఈ 3 టెస్టులతో ఈజీగా తెలుసుకోండి..
Top 3 Tests To Check Your Heart Health
Krishna S
|

Updated on: Jun 16, 2026 | 3:25 PM

Share

ఈ టెక్ యుగంలో గుండె జబ్బుల ముప్పు అంతకంతకూ పెరిగిపోతోంది. గతంలో పెద్దవారికే మాత్రమే వచ్చే ఈ సైలెంట్ కిల్లర్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరినీ కబళిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా హార్ట్ ఎటాక్ కేసులు విపరీతంగా పెరిగాయి. చెడు ఆహారపు అలవాట్లు, గజిబిజి జీవనశైలి, మానసిక ఒత్తిడి, ధూమపానం వంటి అలవాట్లు శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలను వేగంగా పెంచుతున్నాయి. ఇవే గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు గుండె జబ్బులే అతిపెద్ద కారణంగా నిలిచాయి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే… ఈ వ్యాధి ముందస్తు లక్షణాలు ఏవీ కనిపించకుండానే సడెన్‌గా అటాక్ చేస్తుంది. అందుకే రొటీన్ హెల్త్ చెకప్‌లోనే తమ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. ఎయిమ్స్ మాజీ కన్సల్టెంట్, సాఓల్ హార్ట్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజర్ ప్రకారం.. గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి మార్కెట్లో ఎన్నో పరీక్షలు ఉన్నాయి. అయితే అందులో ఏ పరీక్షలు నిజంగా అవసరమో, ఏవి సులువుగా వ్యాధిని గుర్తిస్తాయో తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏ పరీక్ష చేయించుకోవాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మరి గుండె జబ్బుకు అసలు కారణం ఏంటి? దాన్ని గుర్తించే ఆ 3 ముఖ్యమైన పరీక్షల గురించి తెలుసుకుందాం..

గుండె జబ్బుల్లో అసలు సమస్య ఏమిటి?

గుండె జబ్బుల మూలాల్లో ఉండే ఒకే ఒక్క పెద్ద సమస్య.. ధమనులలో బ్లాకేజ్. ఈ బ్లాకేజ్ అనేది రాత్రికి రాత్రే ఏర్పడదు. సంవత్సరాల తరబడి నెమ్మదిగా పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయే కొవ్వు దీనికి ప్రధాన కారణం. దీనినే మెడికల్ భాషలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అని పిలుస్తారు. ఇవి పెరిగినప్పుడు గుండె ధమనులు ఇరుకుగా మారి, రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఈ కొవ్వు శాతాన్ని కనిపెట్టి, గుండె స్థితిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరం.

 లిపిడ్ ప్రొఫైల్

గుండె పరీక్షల్లో మొదటి, అత్యంత కీలకమైన అడుగు లిపిడ్ ప్రొఫైల్. ఇదొక సాధారణ రక్త పరీక్ష. దీని ద్వారా టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, LDL (చెడు కొవ్వు), HDL (మంచి కొవ్వు) వివరాలు తెలుస్తాయి. సాధారణంగా ల్యాబ్ రిపోర్టుల్లో కొలెస్ట్రాల్ నార్మల్ రేంజ్ 130 నుండి 200 వరకు ఉన్నప్పటికీ, 150 దాటితే గుండెకు మంచిది కాదు. ఒకవేళ కొలెస్ట్రాల్ 130 ఆస్పాస్, ట్రైగ్లిసరైడ్స్ 100 ఆస్పాస్ ఉంటే గుండెలో బ్లాకేజ్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇవి పెరిగే కొద్దీ హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతుంది.

సీటీ కోరోనరీ యాంజియోగ్రఫీ

ప్రస్తుత కాలంలో గుండెను పరీక్షించడానికి ఇది అత్యంత నమ్మకమైన పద్ధతి. గుండె ధమనులలో ఎంత శాతం బ్లాకేజ్ ఉందో ఇది ఖచ్చితంగా చెప్తుంది. ఈ పరీక్షలో ఎలాంటి వైర్లు లోపలికి పంపరు, రోగి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే రిపోర్ట్ వచ్చేస్తుంది. దీనివల్ల జీవనశైలి మార్చుకుంటే సరిపోతుందా లేదా చికిత్స అవసరమా అనేది సులువుగా నిర్ణయించవచ్చు. ప్రస్తుతం దేశంలోని వందలాది నగరాల్లో, చిన్న పట్టణాల్లో కూడా ఈ సిటీ యాంజియోగ్రఫీ సదుపాయం అందుబాటులో ఉంది.

 ఎకోకార్డియోగ్రఫీ

ఈ పరీక్ష గుండె నిర్మాణం, దాని పంపింగ్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. గుండె కండరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా? గుండె వాల్వ్స్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయా? పంపింగ్ బలహీనపడిందా? వంటి విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. కొన్నిసార్లు బ్లాకేజ్ లేకపోయినా గుండె బలహీనపడుతుంది. అలాంటి స్థితిని గుర్తించడానికి ఎకో టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది.

మీ గుండె నిజంగా ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి.. లిపిడ్ ప్రొఫైల్, సీటీ కోరోనరీ యాంజియోగ్రఫీ, ఎకోకార్డియోగ్రఫీ… ఈ మూడు పరీక్షలు సరిపోతాయి. ఇవి గుండెలోని కొవ్వు స్థితిని, బ్లాకేజీలను, పంపింగ్ సామర్థ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. దీనివల్ల సరైన చికిత్స అందడమే కాకుండా అనవసరమైన భయాలు, తొందరపాటు ఆపరేషన్ల నుండి తప్పించుకోవచ్చు.

FAQ

ప్రశ్న: గుండె పరీక్షలు ఎప్పుడు, ఏ వయసు నుండి రెగ్యులర్‌గా చేయించుకోవాలి?

జవాబు: సాధారణంగా 30 ఏళ్లు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి ప్రాథమిక గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఇతర సమస్యలు ఏవైన ఉంటే ముందే చేయించుకోవడం ఇంకా మంచిది.

ప్రశ్న: గుండె బ్లాకేజీలను కేవలం లైఫ్‌స్టైల్ మార్పుల ద్వారా తగ్గించుకోవచ్చా?

జవాబు: అవును, ప్రారంభ దశలో ఉన్న బ్లాకేజీలను సరైన ఆహార నియమాలు, క్రమంతప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా నియంత్రించవచ్చు. అయితే బ్లాకేజ్ శాతం ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అవసరం.

ప్రశ్న: శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు ఎంత ఉండాలి?

జవాబు: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే టోటల్ కొలెస్ట్రాల్ 130 mg/dL కి ఆస్పాస్, అలాగే ట్రైగ్లిసరైడ్స్ స్థాయి 100 mg/dL కి ఆస్పాస్ ఉండటం సురక్షితం.

Follow Us