AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి.. హైపవర్ కమిటీ ఆదేశాలతో వంతార కీలక నిర్ణయం

కొల్హాపూర్ ప్రజలు ఎంతో ఆప్యాయంగా మహాదేవి అని పిలుచుకునే ఏనుగు మాధురి తిరిగి కొల్హాపూర్‌కు చేరనుంది. హైపవర్ కమిటీ (HPC) జారీ చేసిన తాజా ఆదేశాల మేరకు మాధురిని తిరిగి కొల్హాపూర్ పంపేందుకు వంతార ట్రస్ట్ పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసింది. మాధురి ఆరోగ్య రక్షణ దృష్ట్యా కమిటీ విధించిన కఠిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి.. హైపవర్ కమిటీ ఆదేశాలతో వంతార కీలక నిర్ణయం
Elephant Madhuri Return To Kolhapur
Anand T
|

Updated on: Sep 11, 2026 | 3:36 PM

Share

సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టుల మార్గదర్శకత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఆదేశాల మేరకు 2025 జూలై 30న మాధురిని సంరక్షణ నిమిత్తం జామ్‌నగర్‌లోని వంతార కేంద్రానికి తరలించారు. అయతే హైపర్ కమిటీ ఆదేశాల ప్రకారమే వైద్య సహాయం అందించామని వంతార తెలిపింది. కొల్హాపూర్ ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ, సంబంధిత అధికారుల ఆదేశాలకు లోబడి ఉంటామని గతంలోనే స్పష్టం చేసింది.

ఇరువర్గాల వాదనలు, క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం, నందనిలోని వసతులను తనిఖీ చేసిన హైపవర్ కమిటీ.. 2026 సెప్టెంబర్ 9న ఏనుగును తిరిగి కొల్హాపూర్‌కు తరలించేందుకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. షరుతుల్లో ముఖ్యంగా ఆ ఏనుగులు ఎలాంటి ఊరేగింపులకు లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించకూడదని.. 24 గంటల పర్యవేక్షణ, రక్షణ కల్పించాలి..15 రోజులకు ఒకసారి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.

Elephant Madhuri Return To Kolhapur (1)

అయితే ఏనుగు దీర్ఘకాలిక సమస్యల నుంచి పూర్తిగా కోలుకోలేదని, దానికి నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని వంతార వెల్లడించింది. కొల్హాపూర్ తరలించడంతో తమ బాధ్యత ముగియలేదని.. HPC మార్గదర్శకాల ప్రకారం, వంతారకు చెందిన ప్రత్యేక వెటర్నరీ వైద్యుల బృందం ప్రతి 15 రోజులకు ఒకసారి నందనిని సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలను అధికారులకు అందజేస్తారని తెలిపింది.

Elephant Madhuri Return To Kolhapur (2)

అలాగే, నందనిలోని ఆవరణలో వైద్య సదుపాయాలు, మందులు, పరికరాలను ఇప్పటికే సమకూర్చామని, స్థానిక టౌన్ ప్లానింగ్ నిబంధనల పరిమితుల వల్ల ప్రస్తుతానికి కొన్ని పనులు ఆగినా, భవిష్యత్తులో సౌకర్యాల ఆధునీకరణకు మఠానికి పూర్తి సాంకేతిక, వైద్య సహాయం అందిస్తామని వంతార పేర్కొంది.

Elephant Madhuri Return To Kolhapur (3)

మాధురి ఆరోగ్యమే తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్న వంతార.. ఈ ప్రక్రియలో సహకరించిన సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టు, మహారాష్ట్ర-గుజరాత్ ప్రభుత్వాలు, పెటా ఇండియా, కొల్హాపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది.

Elephant Madhuri Return To Kolhapur (4)

పోస్ట్ చూడండ..

View this post on Instagram

A post shared by TV9 Telugu (@tv9telugu)

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.