boAt నుంచి అదిరిపోయే సౌండ్‌బార్స్.. 25వేల బడ్జెట్‌లో ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్..
ఇంట్లోనే సినిమా థియేటర్ లాంటి అదిరిపోయే సౌండ్ అనుభూతిని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే భారీ హోమ్ థియేటర్ల కోసం వేలకు వేలు కుమ్మరించాల్సిన పనిలేకుండా, తక్కువ బడ్జెట్‌లోనే సూపర్బ్ ఆడియోను అందించేందుకు ప్రముఖ బ్రాండ్ బోట్ సరికొత్త సౌండ్‌బార్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారత్‌లో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్ శరవేగంగా మారతుంది. కేవలం టీవీ స్పీకర్లు లేదా సాధారణ బ్లూటూత్ స్పీకర్లతో సరిపెట్టుకునే రోజులు పోయాయి. భారీగా ఖర్చు చేయకుండానే, బడ్జెట్ ధరలోనే తమ లివింగ్ రూమ్‌ను మినీ సినిమా థియేటర్‌గా మార్చుకోవాలని సినీ ప్రియులు, గేమర్లు కోరుకుంటున్నారు. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్ తక్కువ ధరల్లో రెండు శక్తివంతమైన సౌండ్‌బార్లను అందుబాటులోకి తెచ్చింది. అవే boAt Aavante Prime 5.1 5000D, boAt Aavante Prime X.
boAt Aavante Prime 5.1 5000D: బడ్జెట్ ధరలో నిజమైన 5.1 సరౌండ్ సౌండ్
తక్కువ ధరలో లభించే చాలా సౌండ్‌బార్లు కేవలం సింగిల్ బార్‌తో వచ్చి ఒకే వైపు నుంచి ఆడియోను అందిస్తాయి. కానీ Aavante Prime 5.1 5000D పూర్తిస్థాయి 5.1 ఛానల్ హోమ్ థియేటర్ సెటప్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సిస్టమ్ ఏకంగా 500W RMS అవుట్‌పుట్‌ను అందిస్తుంది. బోట్ సిగ్నేచర్ సౌండ్ ప్రొఫైల్‌తో రూపొందించడం వల్ల మీడియం నుంచి పెద్ద సైజు గదుల్లో కూడా హై-వాల్యూమ్ వద్ద స్పష్టమైన డైలాగ్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఆస్వాదించవచ్చు. ఇందులో ఒక వైర్డ్ సబ్‌వూఫర్, రెండు వైర్డ్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. గేమింగ్ లేదా ఫాస్ట్-పేస్డ్ మూవీ సీన్లలో ఏమాత్రం ఆడియో ల్యాగ్ లేకుండా సింక్ అయ్యేందుకే ఉద్దేశపూర్వకంగా వైర్డ్ సెటప్ అందించినట్లు కంపెనీ పేర్కొంది.
కనెక్టివిటీ – కంట్రోల్స్:
Bluetooth v5.3, HDMI (ARC), Optical, AUX, USB సపోర్ట్ ఉన్నాయి. HDMI ARC వల్ల టీవీ రిమోట్‌తోనే సౌండ్‌బార్ వాల్యూమ్‌ను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. మూవీ, మ్యూజిక్, న్యూస్ అనే మూడు ప్రత్యేక EQ మోడ్స్‌తో పాటు మాస్టర్ రిమోట్ ద్వారా బాస్, ట్రిబుల్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్‌తో లివింగ్ రూమ్‌కు ఆధునిక లుక్ ఇస్తుంది. దీని అసలు రూ.34,990 కాగా, అధికారిక వెబ్‌సైట్‌లో దాదాపు 66శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.11,999కే లభిస్తోంది. బాక్స్‌లోనే వాల్-మౌంట్ కిట్, కేబుల్స్, బ్యాటరీలు అన్నీ లభిస్తాయి.
boAt Aavante Prime X: 7.1.4 ఛానల్ డాల్బీ అట్మాస్ అనుభవం
రూ.25,000 బడ్జెట్‌లో ప్రీమియం సినిమాటిక్ ఎఫెక్ట్స్, వైర్‌లెస్ అనుభవం కోరుకునే వారికి Aavante Prime X సరైన ఎంపిక. ఇందులో సీలింగ్ వైపు సౌండ్‌ను ప్రసరింపజేసే నాలుగు ప్రత్యేక అప్‌వర్డ్-ఫైరింగ్ ఛానల్స్ ఉన్నాయి. వర్షం పడటం, హెలికాప్టర్ లేదా విమానం పైనుంచి వెళ్లడం వంటి సీన్లలో పైనుంచే సౌండ్ వస్తున్న అద్భుతమైన డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్‌ను ఇది అందిస్తుంది. మొత్తం 700W అవుట్‌పుట్ కలిగిన ఈ సిస్టమ్‌లో వైర్‌లెస్ సబ్‌వూఫర్, విడదీయగలిగే రియర్ స్పీకర్లు ఉన్నాయి. గది అంతటా కేబుల్స్ వేయాల్సిన తలనొప్పి ఉండదు. రియర్ స్పీకర్లలో 4,500mAh బ్యాటరీ ఉంది. ఇది డాల్బీ అట్మాస్ కంటెంట్‌పై 12 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది. HDMI eARC, బ్లూటూత్ 5.3 వంటి అధునాతన కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. Aavante Prime X లిస్టెడ్ ప్రైస్ రూ.39,999 అయినప్పటికీ, సేల్స్, ఆఫర్ల సమయంలో దాదాపు రూ.25,000 లేదా అంతకంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది.
ఏది ఎవరికి బెస్ట్?
Aavante Prime 5000D: బడ్జెట్ రూ.12,000 లోపు ఉండి, కేబుల్స్ ఉన్నా పర్వాలేదు, లాగ్ లేకుండా స్వచ్ఛమైన సరౌండ్ సౌండ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ.
Aavante Prime X: రూ.25,000 బడ్జెట్‌లో రూమ్ నిండా వైర్లు లేకుండా, పైనుంచి వచ్చే డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్స్‌తో రియల్ థియేటర్ అనుభూతిని కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్‌ను కొనుగోలు చేసినా.. ముందు boAt ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రస్తుత ధర, ఆఫర్స్‌ను చెక్ చేయడం మంచిది. ప్రమోషనల్ డిస్కౌంట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
